I Support Liger
I Support Liger: టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘లైగర్’ మూవీ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కించగా, మోస్ట్ వాంటెడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, లైగర్ టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశాయి.
#BoycottLiger : ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న బాయ్‌కాట్ లైగర్.. లైగర్ టాలీవుడ్ సినిమా కాదా??
ఈ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ నిర్వహిస్తున్న ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్‌లో ఉండటంతో ఈ సినిమా కోసం సౌత్‌లోనే కాకుండా నార్త్ ఆడియెన్స్ కూడా కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. అయితే బాలీవుడ్‌లోనూ ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న తరుణంలో, లైగర్ చిత్రానికి ఓ కొత్త తలనొప్పి వచ్చి పడింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బడా సినిమాలను సైతం కుదిపేస్తున్న బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్ లైగర్ చిత్రానికి కూడా తాకింది. దీంతో సోషల్ మీడియాలో బాయ్‌కాట్ లైగర్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో కొందరు ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న లైగర్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. లైగర్ చిత్రం బాలీవుడ్ మూవీ కాదని.. ఇది పక్కా సౌత్ సినిమా అని వారు చెబుతున్నారు. అంతేగాక ‘ఐ సపోర్ట్ లైగర్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో లైగర్ సినిమాపై తమకున్న అభిమానం, ప్రేమను సోషల్ మీడియాకు చూపిస్తున్నారు. దీంతో బాయ్‌కాట్ లైగర్ అనే ట్యాగ్‌ను వెనక్కినెట్టి మరీ ‘ఐ సపోర్ట్ లైగర్’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. రౌడీ ఫ్యాన్స్ దెబ్బకు ట్విట్టర్‌లో ప్రస్తుతం లైగర్‌కు సపోర్ట్ ఎవరూ ఊహించని రేంజ్‌లో దక్కుతోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.