#BoycottLiger : ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న బాయ్‌కాట్‌ లైగర్.. లైగర్ టాలీవుడ్ సినిమా కాదా??

బాయ్‌కాట్‌ బాలీవుడ్‌ లిస్ట్ లో లైగర్ సినిమా కూడా చేర్చేసారు. బాలీవుడ్ ని భయపెడుతున్న ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్‌ ఇప్పడు 'లైగర్‌' సినిమాను కూడా తాకింది. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, అనన్య జంటగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో..............

#BoycottLiger : ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న బాయ్‌కాట్‌ లైగర్.. లైగర్ టాలీవుడ్ సినిమా కాదా??

Boycott Liger Trendi in Twitter

#BoycottLiger :  బాయ్‌కాట్‌ బాలీవుడ్‌ ప్రస్తుతం బాగా వినపడుతున్న పేరు. అసలే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న బాలీవుడ్ ని ఈ బాయ్ కాట్ మరింత నష్టాల్లోకి నెట్టేస్తుంది. అమీర్ ఖాన్ గతంలో మన దేశానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలని గుర్తు చేస్తూ లాల్ సింగ్ చడ్డా సినిమాని, ఆ సినిమాని సపోర్ట్ చేసినందుకు హృతిక్ రోషన్ విక్రమ్ వేద సినిమాని, ఇప్పుడు తాప్సి దొబారా సినిమాని బాయ్ కాట్ చేస్తున్నారు. ఇక బాయ్ కాట్ మీద నెగిటివ్ గా మాట్లాడిన బాలీవుడ్ యాక్టర్స్ ని కూడా బాయ్ కాట్ అంటున్నారు. గత కొద్ది రోజులుగా ఏకంగా బాయ్‌కాట్‌ బాలీవుడ్‌ వినిపిస్తుంది. ఈ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.

అయితే ఈ బాయ్‌కాట్‌ బాలీవుడ్‌ లిస్ట్ లో లైగర్ సినిమా కూడా చేర్చేసారు. బాలీవుడ్ ని భయపెడుతున్న ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్‌ ఇప్పడు ‘లైగర్‌’ సినిమాను కూడా తాకింది. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, అనన్య జంటగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ఉండటంతో కొన్ని రోజుల నుంచి దేశమంతటా సినిమా ప్రమోషన్స్ ని పీక్స్ లో చేస్తున్నారు. రిలీజ్ డేట్‌ దగ్గరపడుతున్న సమయంలో లైగర్‌కు బాయ్‌కాట్‌ సెగ తగిలింది.

Vivek Ranjan Agnihotri : మీ సినిమాలని బాయ్ కాట్ చేస్తే నష్టమా.. చిన్న సినిమాలని మీరు అడ్డుకున్నప్పుడు.. బాలీవు డాన్ లకు కౌంటర్..

దీనికి కారణం లైగర్ సినిమా కూడా బాలీవుడ్ సినిమా అని అంతా అనుకుంటున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ తప్పితే మిగిలిన వాళ్ళు బాలీవుడ్ అవ్వడం నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాని ప్రెజెంట్ చేయడంతో దీన్ని కూడా బాయ్ కాట్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఇది హిందీ సినిమానే తెలుగు డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు, సినిమా మొత్తం ముంబైలోనే తెరకెక్కించారు, బాలీవుడ్ ఫ్లేవర్ కనిపిస్తుంది పాటల్లో అనే కామెంట్స్ చేస్తూ బాయ్ కాట్ చేస్తున్నారు.

ఇక మరో కారణం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొందా అమీర్ ఖాన్ కి సపోర్ట్ ఇస్తూ లాల్ సింగ్ చడ్డా బాయ్ కాట్ మీద మాట్లాడాడు. దీంతో ఈ రీజన్ ఒక్కటి చాలు లైగర్ సినిమాని బాయ్ కాట్ చేయడానికి అని అంటున్నారు బాలీవుడ్ నెటిజన్లు. మరో కారణం విజయ్‌ దేవరకొండ యాటిట్యూడ్‌ అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది 25 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళే. యూత్, టీనేజ్ వాళ్లే విజయ్ కి ఫ్యాన్స్ ఎక్కువ. ఇష్టం వచ్చినట్టు ఉండటం, మాట్లాడటం లాంటివి చూసి అతనికి ఆకర్షితులవుతున్నారు. దీంతో కొంతమంది ఈ యాటిట్యూడ్ కూడా అన్ని చోట్ల, అన్ని సార్లు పనికిరాదని కామెంట్స్ చేస్తూ బాయ్ కాట్ అంటున్నారు. ఏకంగా ట్విట్టర్లో లైగర్‌ సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ #BoycottLiger అనే ‍హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ ఆలోచనలో పడ్డారు. అయితే విజయ్ ఇలాంటివి పట్టించుకోడు, అంతే కాక వీటిపై రివర్స్ కామెంట్స్ కూడా చేస్తాడు. మరి బాయ్ కాట్ లైగర్ పై విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తాడో చూడాలి.