Lokesh Kanagaraj : కమల్ హాసన్, రజినీకాంత్ తో సినిమా చేసేవాడిని.. కానీ.. లోకేష్ కనగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

I used to do movies with Kamal Haasan and Rajinikanth Lokesh Kanagaraj Interesting comments

Lokesh Kanagaraj : స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఇప్పటికే వచ్చిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ అయ్యాయో మనందరికీ తెలిసిందే.

Also Read : Malliswari Movie : వామ్మో.. మల్లీశ్వరి సినిమాలో డైనింగ్ టేబుల్ వెనక అంత పెద్ద స్టోరీ ఉందా..

అయితే లోకేష్ ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు షాకింగ్ విషయాలను తెపిపాడు. ఇంటర్వ్యూ లో యాంకర్ మాట్లాడుతూ.. మీ యూనివర్స్ నుండి వచ్చిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలకి సీక్వెల్స్ వస్తాయని మేమందరం ఎదురు చూస్తుంటే.. మీరు మాత్రం దీనికి భిన్నంగా కూలీ సినిమా తెస్తున్నారు ఎందుకని అడిగారు..

దానికి లోకేష్ సమాధానమిస్తూ.. నాకు ఎప్పటినుండో రజినీ సార్ తో సినిమా చెయ్యాలని ఉంది. నిజానికి కరోనా టైమ్ లోనే రజిని కాంత్, కమల్ హాసన్ తో కలిసి ఒక సినిమా చెయ్యాలి కానీ కుదరలేదు. ఆ సమయంలో కమల్ హాసన్ తో సినిమా చెయ్యాల్సి ఉందని ముందు ఆ సినిమా చేశా.. ఇక నుండి నా యూనివర్స్ నుండి వచ్చే సినిమాలు ముందు సినిమాలకి బేస్ మెంట్ గా నిలుస్తాయి. అలా చివరి 7వ ,8వ సినిమాలతో నా యూనివర్స్ లో వచ్చే సినిమాలకి ఎండ్ పడుతుంది. విజయ్ ఓకే అంటే `లియో 2` కథ సిద్ధంగా ఉందని తెలిపారు. త్వరలోనే అన్ని సినిమాలు వస్తాయన్నారు. సూర్యతో సపరేట్ గా ఓ సినిమా చేస్తా అన్నారు. మొత్తానికి ముందు ఖైదీ 2, సూర్యతో రోలెక్స్, చివరికి విక్రమ్ 2 చేస్తా అన్నారు.