Malliswari Movie : వామ్మో.. మల్లీశ్వరి సినిమాలో డైనింగ్ టేబుల్ వెనక అంత పెద్ద స్టోరీ ఉందా..

Malliswari Movie : వామ్మో.. మల్లీశ్వరి సినిమాలో డైనింగ్ టేబుల్ వెనక అంత పెద్ద స్టోరీ ఉందా..

such a big story behind the dining table in the movie Malleeswari director Vijaya Bhaskar shocking comments

Updated On : November 5, 2024 / 4:48 PM IST

Malliswari Movie : కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మల్లీశ్వరి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టని సినిమాలు కొన్ని ఉంటాయి. ఆ లిస్ట్ లో ముందు వరుసలో ఉంటుంది మల్లీశ్వరి. విక్టరీ వెంకటేష్ హీరోగా కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సునీల్, బ్రహ్మానందం కామెడీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.

అయితే ఈ సినిమా డైరెక్టర్ కె. విజయ భాస్కర్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. మల్లీశ్వరి సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచున్నారు.. ఆయన మాట్లాడుతూ.. మల్లీశ్వరి సినిమా షూటింగ్ చేసిన లలిత మహల్ లో మీరందరు చూసిన డైనింగ్ టేబుల్ ఉండదు. నిజానికి మల్లీశ్వరి సినిమాలో డైనింగ్ టేబుల్ కి సంబందించే ఎక్కువ సీన్స్ ఉంటాయి. అందుకే ఈ సినిమా కోసం ఆ డైనింగ్ టేబుల్ ను స్వయంగా నిర్మాత సురేష్ దగ్గరుండి చేయించారు. ఈ సినిమా కోసమే దాన్ని అంత పెద్దగా చేయించారని చెప్పారు.

Also Read : Salman Khan : బెదిరింపులకు భయపడని సల్మాన్ ఖాన్.. సికిందర్ సినిమా షూటింగ్ వీడియో లీక్.. షూట్ ఎక్కడంటే..

ఇక ఈ సినిమాలో వెంకటేష్, బ్రహ్మహానందం మధ్య డైనింగ్ టేబుల్ దగ్గర జరిగే సీన్ చాలా బాగుంటుంది. ఈ సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇకపోతే ఈ సినిమా 2004లో విడుదలైంది. అప్పట్లోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పటికీ టీవీల్లో వస్తే మిస్ అవ్వరు జనాలు.