Salman Khan : బెదిరింపులకు భయపడని సల్మాన్ ఖాన్.. సికిందర్ సినిమా షూటింగ్ వీడియో లీక్.. షూట్ ఎక్కడంటే..

Salman Khan : బెదిరింపులకు భయపడని సల్మాన్ ఖాన్.. సికిందర్ సినిమా షూటింగ్ వీడియో లీక్.. షూట్ ఎక్కడంటే..

Salman Khan who is not afraid of threats Sikander movie shooting video leaked

Updated On : November 5, 2024 / 4:33 PM IST

Salman Khan : సల్మాన్ ఖాన్ కి గత కొంత కాలంగా వరుస బెదిరింపు కాల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సల్లూ భాయ్ కి వరుస బెదిరింపు కాల్స్ రావడంతో కొన్ని రోజులు సినిమాలను పక్కన పెట్టి ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ మధ్య మాత్రం భారీ బందోబస్త్ తో బిగ్ బాస్ షూటింగ్ కి వెళ్ళాడు.

అయితే తాజాగా ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఒప్పుకున్న సికిందర్ సినిమా షూటింగ్ లో ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే.. గతంలో సల్మాన్ కి బెదిరింపు కాల్స్ రావడం ఒకెత్తు అయితే మళ్ళీ ఇప్పుడు దానికి మించిన బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సల్మాన్ వీటిని ఏ మాత్రం పట్టించుకోకుండా మురుగదాస్ దర్శకత్వంలో సికిందర్ సినిమా షూటింగ్ లో కనిపించడం షాకింగ్ గా ఉంది.

Also Read : Chetan Krishna : తెలుగు సినిమాలను పట్టించుకోవడం లేదు.. థియేటర్స్ ఇవ్వడం లేదు.. ‘ధూం ధాం’ హీరో ఎమోషనల్..

ఆ షూటింగ్ కి సంబందించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియోలో రష్మిక మందన్న ఏదో డైలాగ్ చెప్తూ ఉంది. అలాగే సల్మాన్ ఖాన్ షూటింగ్ స్పాట్ కి చేరుకుంటున్నారు. మొత్తానికి రష్మిక, సల్మాన్ ఖాన్ ఇద్దరూ సికిందర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని ఫలక్‌నుమా ప్యాలెస్ లో జరుగుతుంది.