Chetan Krishna : తెలుగు సినిమాలను పట్టించుకోవడం లేదు.. థియేటర్స్ ఇవ్వడం లేదు.. ‘ధూం ధాం’ హీరో ఎమోషనల్..

Chetan Krishna : తెలుగు సినిమాలను పట్టించుకోవడం లేదు.. థియేటర్స్ ఇవ్వడం లేదు.. ‘ధూం ధాం’ హీరో ఎమోషనల్..

Not caring about Telugu movies Not giving theaters Dhoom Dham movie hero Chetan Krishna is emotional

Updated On : November 5, 2024 / 3:01 PM IST

Chetan Krishna : చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ధూం ధాం’. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మాణంలో సాయి కిషోర్ మ‌చ్చా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నవంబర్ 8న థియేటర్స్ లోకి రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

Also Read : Pushpa 2 : పుష్ప 2 ట్రైలర్ అప్డేట్ ఇస్తూ.. సరికొత్త పోస్టర్ రిలీజ్..

అయితే తాజాగా ఈ సినిమాకి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఇందులో ధూం ధాం హీరో చేతన్ కృష్ణ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు..

ఇక ఆ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. “ఈ విషయం గురించి నేను మాటాడకూడదు అనుకున్న కానీ, మాట్లాడుతున్నాను. ఓ చిన్న డబ్బింగ్ సినిమా.. మన ఇండస్ట్రీది కాని సినిమాలను మన దగ్గర ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే మన దగ్గర థియేటర్స్ దొరకడం లేదు. థియేటర్స్ అన్నీ చాలా టైట్ గా ఉన్నాయి. అలాంటిది ఒకే ఒక్క థియేటర్ ఖాలీగా ఉంది. ఆ థియేటర్ కూడా ఆ చిన్న డబ్బింగ్ సినిమాను తీసుకుంది.అది మన ఇండస్ట్రీ సినిమాకు కాదు, మన భాష కాదు, అలా అని పెద్ద స్టార్ కాస్ట్ ఉన్న సినిమా కూడా కాదు. అలాంటి సినిమాకి థియేటర్ ఇచ్చారు. కానీ మన తెలుగు సినిమాలకి మాత్రం థియేటర్స్ దొరకడం లేదు. ఇప్పుడు కేవలం నా ఒక్కడి సినిమానే కాదు.. దాదాపుగా 7 సినిమాలు ఉన్నాయి. నా సినిమాకే కాకుండా ఈ 7 సినిమాల్లో ఏ ఒక్క సినిమాకి థియేటర్ ఇచ్చినా నేను బాధ పడేవాడిన కాదు. కానీ మన తెలుగు సినిమాలను పట్టించుకోకుండా ఆ సినిమాకి థియేటర్ ఇవ్వడం బాధాకరం అంటూ.. చేతన్ కృష్ణ ఎమోషనల్ అయ్యారు.