Pushpa 2 : పుష్ప 2 ట్రైలర్ అప్డేట్ ఇస్తూ.. సరికొత్త పోస్టర్ రిలీజ్..

Pushpa 2 : పుష్ప 2 ట్రైలర్ అప్డేట్ ఇస్తూ.. సరికొత్త పోస్టర్ రిలీజ్..

Allu Arjun Pushpa 2 movie trailer update New poster release

Updated On : November 5, 2024 / 1:33 PM IST

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన భారీ బడ్జెట్ సినిమా పుష్ప 2. డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న ఈ సినిమా సుకుమార్ దర్శకత్వంలో రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే ఓ చిన్న టీజర్, పాటలు , పోస్టర్స్ విడుదల చెయ్యగా అవి సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉన్నాయి.

Also Read : Salman Khan : 5 కోట్లు ఇస్తావా, చస్తావా.. సల్మాన్ ఖాన్ కి మరోసారి బెదిరింపు కాల్స్..

అయితే పుష్ప 2 విడుదల సమయం దగ్గర పడుతుండడంతో వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమాకి సంబందించిన మరో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పుష్ప రిలీజ్ కి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉందని గుర్తుచేస్తూ..ట్రైలర్ కూడా త్వరలోనే రాబోతుందని పేర్కొన్నారు. అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్ ఎదురెదురుగా నిలుచొని ఒకరినొకరు కోపంగా చూసుకుంటున్నట్టు పోస్టర్ లో చూపించారు.

ఇక ఎప్పుడో ఆగస్టు లోనే రావాల్సిన ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ లో రానుంది. దానితో పాటు మేకర్స్ సైతం వరుస అప్డేట్స్ ఇవ్వడంతో ఫాన్స్ పండగ చేసుకునున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, అనసూయలతో పాటు పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.