Salman Khan : 5 కోట్లు ఇస్తావా, చస్తావా.. సల్మాన్ ఖాన్ కి మరోసారి బెదిరింపు కాల్స్..

Bollywood star Salman Khan received yet another death threat
Salman Khan : ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్య జరిగినప్పటి నుండి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు వరుస బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ బెదిరింపుల కారణంగా సల్మాన్ ఇంటి నుండి బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇందుకు గాను సల్మాన్ ఖాన్ తన ఇంటి వద్ద టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనకు భద్రతను పెంచింది.
అయితే తాజాగా మరోసారి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ద్వారా సల్మాన్‌కు బెదిరింపు మెసేజ్ లు వచ్చాయి. “నేను లారెన్స్ బిష్ణోయ్ సోదరుడిని. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే అతను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. లేదంటే రూ.5 కోట్లు ఇవ్వాలి. ఒకవేళ అలా చెయ్యకపోతే మేం అతడిని చంపేస్తాం.. మా గ్యాంగ్ ఇంకా డేంజర్ గా ఉంటుందని” ఆ మెసేజ్‌లో పేర్కొన్నట్లు తెలుస్తుంది.
Also Read : Nithiin : రీ రిలీజ్ కి రెడీ అవుతున్న నితిన్ ఎవర్ గ్రీన్ హిట్ సినిమా.. ఎప్పుడంటే..
దీంతో బాలీవుడ్ లో మరోసారి గందరగోళం నెలకొంది. అయితే వారం వ్యవధిలో సల్మాన్ ఖాన్‌కు ఇది రెండో హత్య బెదిరింపు సందేశం కావడం షాకింగ్ గా ఉంది. మరి ఈ విషయం పై సల్మాన్ ఏం చేస్తారన్నది తెలియాల్సి ఉంది. క్షమాపణలు చెప్తారా, లేదంటే రూ.5 కోట్లు ఇస్తారా అన్నది చూడాలి.