Nithiin : రీ రిలీజ్ కి రెడీ అవుతున్న నితిన్ ఎవర్ గ్రీన్ హిట్ సినిమా.. ఎప్పుడంటే..

Nithiin : రీ రిలీజ్ కి రెడీ అవుతున్న నితిన్ ఎవర్ గ్రీన్ హిట్ సినిమా.. ఎప్పుడంటే..

Nitin evergreen hit movie Ishq is getting ready for re release

Updated On : November 5, 2024 / 12:18 PM IST

Nithiin : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కెరీర్ తొలినాళ్ళ లోనే వరుస హిట్స్ అందుకున్నాడు. ఆయన చేసిన మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత దర్శక ధీరుడు రాజమౌళితో చేసిన సై సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. అనంతరం వరుస సినిమాలు చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు.

అలా వరుస ఫ్లాప్స్ లో ఉన్న నితిన్ కి మంచి కం బ్యాక్ ఇచ్చిన సినిమానే ఇష్క్. ఇక ఈ సినిమా శ్రేష్ట్ మూవీస్ పతాకంపై విక్రమ్ గౌడ్, సుధాకర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో విక్రం కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే ఈ సినిమా 2012 లో విడుదలైంది. దాదాపుగా ఇప్పుడు 11 ఏళ్ల తరువాత మళ్ళీ ఈ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతుంది.

Also Read : Rakul Preet Singh : ఆ 500 లతోనే నా జీవితం మారిపోయింది.. రకుల్ షాకింగ్ కామెంట్స్..

ఈ నెల నవంబర్ 30న ఇష్క్ సినిమా మళ్ళీ థియేటర్స్ లోకి రానుంది. ఇక ఈ చిత్రంలో నితిన్, నిత్య మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. అనూప్ రూబెన్స్, అరవింద్ శంకర్ సంగీతం అందించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ సీని ఇండస్ట్రీ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.