Rakul Preet Singh : ఆ 500 లతోనే నా జీవితం మారిపోయింది.. రకుల్ షాకింగ్ కామెంట్స్..

My life changed with that 500 Rakul Preet Singh shocking comments
Rakul Preet Singh : స్టార్ హీరోయిన్ లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలిసిందే. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా హిందీలో కూడా సినిమాలు చేసి మరింత గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. అలా వరుస సినిమాలు చేస్తున్న సమయంలో వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది. ఇప్పుడు హిందీలో థ్యాంక్ గాడ్ అనే సినిమా చేసింది.
అయితే ఓ సందర్భంగా దీపావళి పండుగ గురించి మాట్లాడుతూ.. నిజానికి దీపావళి పండుగను అందరూ చాలా బాగా జరుపుకుంటారు. అందరూ టపాసులు కాలుస్తారు. అలా ఓ దీపావళి రోజు మా నాన్నా 500 రూపాయల నోటు ఇచ్చాడు. అప్పుడు ఎందుకని నేను అడిగితే.. ఈ డబ్బుతోనే కదా నువ్వు టాపాసులు కొనుక్కొని కాలుస్తావు, దాని వల్ల ఎంత కాలుష్యం, అదే ఈ డబ్బుతో ఎవరన్నా పేదవారికి, అవసరం ఉన్న వారికి చాక్ లెట్స్ లేదా ఇంకేమన్నా కొనివచ్చు అని అన్నారు.
Also Read : Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్.. ఎక్కడో తెలుసా?
మా నాన్న చెప్పింది నిజమే అనిపించింది. ఈ సంఘటన జరిగినప్పుడు నేను 5వ తరగతి చదువుతున్నాను. అప్పటి నుండి ఇప్పటివరకు మళ్ళీ టపాసులు కాల్చలేదు అంటూ తెలిపింది రకుల్. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.