Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్.. ఎక్కడో తెలుసా?

Ram Charan Game Changer Teaser Launch Event in lucknow
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “గేమ్ ఛేంజర్”. స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా పొలిటికల్, యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
Also Read : Bigg Boss 8 : ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు.. ఎవరెవరో తెలుసా?
అయితే తాజాగా ఈ చిత్రం టీజర్ నవంబర్ 9న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లక్నోలోని ఓ కాలేజీలో జరగనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ట్రైలర్ సైతం జనవరి 1న న్యూ ఇయర్ సందర్బంగా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇక గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు రామ్ చరణ్, శంకర్ సహా టీమ్ మొత్తం హాజరవనుంది. అంతేకాకుండా లాంచ్ ఈవెంట్ భారీ ఎత్తున ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
The Command Begins From Nov 9th in the heartland of India ❤️🔥💥#GameChangerTeaser Grand Launch In Lucknow, UP 🔥#GameChanger In Cinemas From 10th Jan, 2025 ✊🏼 pic.twitter.com/rKwvxIHuzh
— Game Changer (@GameChangerOffl) November 5, 2024
ఇకపోతే రామ్ చరణ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్‌జె సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు.