Bigg Boss 8 : ఈ వారం నామినేష‌న్స్‌లో ఏడుగురు.. ఎవ‌రెవ‌రో తెలుసా?

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 ఆస‌క్తిక‌రంగా సాగుతోంది.

Bigg Boss 8 : ఈ వారం నామినేష‌న్స్‌లో ఏడుగురు.. ఎవ‌రెవ‌రో తెలుసా?

Bigg Boss Telugu 8 Nominations list of 10th Week

Updated On : November 5, 2024 / 10:10 AM IST

Bigg Boss 8 : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. తొమ్మిది వారాలు పూర్తి కాగా తొమ్మిది మంది ఎలిమినేట్ అయ్యారు. తాజాగా ప‌దో వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఎప్ప‌టిలాగానే సోమ‌వారం నామినేష‌న్స్ ప్ర‌క్రియ‌ జ‌రిగింది. ప్ర‌తి వారం లాగా కాకుండా ఈ సారి ఒక్క కంటెస్టెంట్ ఒక‌రినే నామినేట్ చేయాల‌ని బిగ్‌బాస్ సూచించాడు. అదే విధంగా మెగా చీఫ్ అయిన కార‌ణంతో అవినాష్‌ను నామినేట్ చేయ‌డానికి వీలు లేద‌ని తెలిపాడు.

ఇక నామినేష‌న్స్ ప్ర‌క్రియ వాడీవేడిగా సాగింది. గౌత‌మ్‌, నిఖిల్ ల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. ఒక‌రు నో అని అన్న‌ప్పుడు నో అనే అర్థం. వ‌ద్ద‌ని చెప్పినా య‌ష్మిని అక్కా అని పిలిచి ఇబ్బంది పెడుతున్నావు అంటూ గౌత‌మ్‌ను నిఖిల్ నామినేట్ చేశాడు. య‌ష్మిని అక్కా అని పిలిస్తే త‌ప్పేంటి, ఆమె కూడా త‌న‌ను త‌మ్ముడు అని పిలిచింది క‌దా అంటూ గౌత‌మ్ వాదించాడు. ఆ త‌రువాత య‌ష్మిని గౌత‌మ్ నామినేట్ చేశాడు. మెగా చీఫ్ అయ్యాకా టీమ్ లోనుంచి త‌న‌ను సైడ్ చేశాడ‌వ‌ని అన్నాడు. దీంతో య‌ష్మి అత‌డితో వాద‌న‌కు దిగింది.

Devara OTT Release : ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న ‘దేవ‌ర‌’.. ఏ రోజు, ఎందులో స్ట్రీమింగ్ కానుందో తెలుసా?

గౌత‌మ్‌ని నిఖిల్‌, య‌ష్మిని గౌత‌మ్‌, గౌత‌మ్‌ని య‌ష్మి, పృథ్వీని టేస్టి తేజ‌, య‌ష్మిని గంగ‌వ్వ‌, రోహిణిని పృథ్వీ, ప్రేర‌ణ‌ని హ‌రితేజ‌, ప్రేర‌ణ‌ని విష్ణుప్రియ‌, య‌ష్మిని రోహిణి, విష్ణుప్రియ‌ని నబీల్‌, హ‌రితేజ‌ని ప్రేర‌ణ లు నామినేట్ చేశారు. దీంతో య‌ష్మి, ప్రేర‌ణ‌, హ‌రితేజ‌, గౌత‌మ్‌, విష్ణు ప్రియ‌ణ‌, రోహిణి, పృథ్వీలు నామినేష‌న్స్‌లో నిలిచారు.

అయితే.. బిగ్‌బాస్ ఓ చిన్న‌ట్విస్ట్ ఇచ్చాడు. నామినేష‌న్స్‌లో ఉన్న వారిలో ఒక‌రిని సేవ్ చేసి, సేవ్ అయిన వారిలో ఒక‌రిని నామినేట్ చేయాల‌ని మెగా చీఫ్ అవినాష్‌కు సూచించాడు. దీంతో అవినాష్ త‌న ప‌వ‌ర్‌ను ఉప‌యోగించి రోహిణిని సేవ్ చేసి నిఖిల్‌ను నామినేట్ చేశాడు.

Samantha : బ‌రువు త‌గ్గ‌డం పై నెటిజ‌న్ వ్యాఖ్య‌.. ఫైర్ అయిన స‌మంత‌..

దీంతో 10వ వారంలో ఏడుగురు య‌ష్మి, హ‌రితేజ‌, ప్రేర‌ణ‌, విష్ణు ప్రియ‌, గౌత‌మ్‌, నిఖిల్‌, పృథ్వీలు నామినేష‌న్స్‌లో ఉన్న‌ట్లు బిగ్‌బాస్ తెలిపాడు.