Samantha : ఐటమ్ సాంగ్స్ చెయ్యను.. సింగిల్‌గా కూడా ఉండను.. సమంత సంచలన వ్యాఖ్యలు..

I will not do item songs Samantha sensational comments

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే గత కొద్ది కాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సామ్ సినిమాలకి దూరంగా ఉంటుంది. ఇటీవల నుండి మళ్ళీ పుంజుకుంది. ఈమె నటించిన సిటాడెల్‌ సిరీస్ ఈనెల 7న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్‌ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

Also Read : Ka Movie : ‘ క ‘ మూవీ టికెట్స్ అమ్ముతున్న కిరణ్ అబ్బవరం.. వీడియో చూసారా..

తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఇక పై మీరు ఐటమ్ సాంగ్స్ చేస్తారా అని అడిగితే లేదు చెయ్యనని క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ చేసింది సమంత. ఇప్పుడు పుష్ప 2 లో కూడా మరో ఐటమ్ సాంగ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి.

కానీ ఈ ఇంటర్వ్యూతో అవన్నీ పుకార్లే అని క్లారిటీ ఇచ్చింది సమంత. అలాగే మీరు సింగిల్ గానే ఉండాలని అనుకుంటున్నారా అంటే లేదని సమాధానం చెప్పింది. దీన్ని బట్టి చూస్తే సామ్ త్వరలోనే మింగిల్ అవ్వడానికి రెడీగా ఉందని అర్ధమవుతుంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఒంటరిగానే ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.