Aditi Rao Hydari
Aditi Rao Hydari: అందమైన కళ్లు, ఆకట్టుకునే రూపంతో చూడముచ్చటగా ఉంటుంది మన హైదరాబాదీ బ్యూటీ అదితి రావు హైదరీ. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ‘ప్రజాపతి’ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన అదితి తర్వాత హిందీలో పలు హిట్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
25 Years Of PAWANISM : పాతికేళ్ల పవనిజమ్
క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం ‘చెలియా’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ‘సమ్మోహనం’ ఆమె యాక్ట్ చేసిన స్ట్రైట్ తెలుగు సినిమా. తర్వాత ‘అంతరిక్షం’, ‘వి’ చిత్రాలతో ఆకట్టుకుంది. ఇప్పుడు ‘మహా సముద్రం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ సినిమా రిలీజ్ కాబోతుండడంతో ప్రమోషన్స్ స్పీడప్ చేశారు.
Maha Samudram Trailer : మన జాతకాన్ని దేవుడు మందు కొట్టి రాసుండాలి..
ఇందులో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. తన మనసులో మాట చెప్పింది. తనకు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటించాలని ఉందని చెప్పింది. భారతరత్న అందుకున్న మొట్టమొదటి సంగీత కళాకారిణి సుబ్బులక్ష్మి పాత్రలో కనిపించాలనేది తన కల అని చెప్పుకొచ్చింది అదితి.