25 Years Of PAWANISM : పాతికేళ్ల పవనిజమ్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ సినిమా ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది..

Akkada Ammayi Ikkada Abbayi
25 Years Of PAWANISM: టాలీవుడ్‌లో హీరోలందరిదీ ఒక రూటు అయితే.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ది సపరేట్ రూటు.. ఆయన క్రేజ్ గురించి, ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సినిమా నుంచి పాలిటిక్స్‌లోకి వెళ్లినా.. తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా క్రేజ్ కొండెక్కి కూర్చుందే తప్ప కొంచెం కూడా తగ్గలేదు. అదీ పవర్‌స్టార్ స్టామినా..
Pawan Kalyan : క్లీన్ స్మాష్.. ‘భీమ్లా నాయక్’ ఆల్ టైమ్ టాప్ 1 రికార్డ్..
పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకాభిమానులకు పరిచమయై 25 సంవత్సరాలవుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ నిర్మాతగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన పవన్ ఫస్ట్ మూవీ ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’..

ఈ మూవీ ద్వారానే అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయ్యింది. 1996 అక్టోబర్ 11న రిలీజ్ అయిన ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ 2021 అక్టోబర్ 11తో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. 25 సంవత్సరాల కెరీర్‌లో 25 సినిమాలు చేశారు పవర్‌స్టార్.

ఈ సినిమా ప్రమోషన్స్ కానీ పవన్ చేసిన మార్షల్ ఆర్ట్స్ కానీ అప్పట్లో ఓ సెన్సేషన్. అయితే పవన్ ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’.. షూటింగ్ టైం లో కొద్ది కాలం పాటు నెలకు ఐదు వేల రూపాయలు జీతంగా తీసుకున్నారు.

కట్ చేస్తే ఇప్పుడు ఒక్క సినిమాకే నిర్మాతలు ఆయనకు అక్షరాలా 50 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. పవన్ స్టామినాకి ఇంకా ఎక్కువిచ్చినా పర్లేదు అనే దర్శక నిర్మాతలు కూడా ఉన్నారు. సినిమా సినిమాకి ఫ్యాన్ ఫాలోయింగ్, స్టార్‌డమ్ పెంచుకుంటూ.. క్రేజ్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారారు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్..
