×
Ad

Pushpa 2 : బిగ్గెస్ట్‌ రిలీజ్‌ ఇండియన్‌ సినిమాగా అల్లు అర్జున్ పుష్ప-2.. సరికొత్త రికార్డ్ ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన సుకుమార్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2.

Icon Star Allu Arjun Pushpa-2 Movie will create a new record as the biggest release Indian movie

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన సుకుమార్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్, సాంగ్స్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబందించిన సెన్సేషనల్ అప్డేట్ రివీల్ చేశారు మేకర్స్. ఏంటంటే.. అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో కలిపి మొత్తం 11,500 స్ర్కీన్స్‌ల్లో విడుదల చేయడానికి మేకర్స్‌ ప్లాన్ చేస్తునట్టు తెలిపారు. ఇండియాలో 6500 స్ర్కీన్స్‌ల్లో, ఓవర్సీస్‌లో 5000 స్ర్కీన్స్‌ల్లో గ్రాండ్‌ విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట నిర్మాతలు. పుష్ప బిగ్గెస్ట్‌ రిలీజ్‌ ఇండియన్‌ సినిమా అని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమా కూడా ఇలాంటి ఘనత సాధించలేదని తెలుపుతున్నారు.

Also Read : Amala Paul : అమలాపాల్ బర్త్ డే.. స్పెషల్ వీడియో షేర్ చేసిన భర్త..

ఇక ఇటీవల పుష్ప 2 ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఇందులో ఈ సినిమాకి సంబందించిన చాల విషయాలను తెలిపారు. పుష్ప 3 పై కూడా అప్డేట్ ఇచ్చేసారు. పుష్ప 2 పార్ట్ వన్ కంటే పెద్ద హిట్ అవుతుందని అన్నారు. అయితే మొత్తానికి ఈ ప్రెస్ మీట్ తో పుష్ప 2 పై అంచనాలు మరింత పెంచేశారు మేకర్స్.