×
Ad

Dhanush: నేను మాట్లాడింది పూర్తిగా విన్నారా? ఎనిమిదేళ్ల పేదరికం అనుభవించా.. ట్రోలింగ్ పై ధనుష్ రియాక్షన్

తమిళ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ(Dhanush) ఇడ్లి కొట్టు. నిత్యా మీనన్ హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Hero Dhanush responds to trolling

Dhanush: తమిళ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఇడ్లి కొట్టు. నిత్యా మీనన్ హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ మంచి(Dhanush) అంచనాలను క్రియేట్ చేసింది. అయితే, ఇటీవల జరిగిన ఇడ్లీ కొట్టు సినిమా ఈవెంట్ లో హీరో ధనుష్ చేసిన వ్యాఖ్యలు ఎంత ట్రోల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఇడ్లీ తినేవాళ్ళం అని, ఇప్పుడు స్టార్ హోటల్స్ లో తింటున్నా ఆ టేస్ట్ రావడం లేదంటూ చెప్పుకొచ్చాడు.

Rishab Shetty: జీవితాంతం గుర్తుండిపోయే సన్నివేశం.. షూట్ టైంలో కఠిన నియమాలు: రిషబ్ శెట్టి

అయితే, ధనుష్ కావాలని ఈ కామెంట్స్ చేశాడని, సింపతీతో ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించాలని ప్లాన్ చేస్తున్నాడు అంటూ దారుణంగా ట్రోల్స్ చేసారు. అయితే, ఈ ట్రోలింగ్స్ ధనుష్ వరకు చేరడంతో తాజాగా రియాక్ట్ అయ్యారు ధనుష్. “మీరు నా స్పీచ్‌ పూర్తిగా విన్నారా. నేను 1983లో పుట్టాను. మా నాన్న 1991లో దర్శకుడయ్యాడు. ఎనిమిదేళ్లపాటు పేదరికంలోనే ఉన్నాం. 1995లో మా కుటుంబం మెరుగుపడింది. డబ్బులు ఉండేవి కాదు. అందుకే ఏదైనా పని చేసి వచ్చిన డబ్బుతో కొనుక్కునేవాడిని” అంటూ చెప్పుకొచ్చాడు.

“అలాగే, ఇడ్లీ కొట్టు సినిమా ప్రముఖ చెఫ్‌ బయోపిక్‌ అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. కానీ, అందులో ఎలాంటి నిజం లేదు. ఇది ఎవరి బయోపిక్‌ కాదు. నేను నా బాల్యంలో ఎదుర్కొన్న సంఘటనల, అనుభవాల ఆధారంగా మాత్రమే చేశాను” అంటూ వివరించాడు ధనుష్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలా తనపై వస్తున్న ట్రోలింగ్స్ కి సమాధానం చెప్పాడు ధనుష్. మరి ఇకనైనా ఈ ట్రోలింగ్స్ చెక్ పడుతుందా అనేది చూడాలి.