Vishwak Sen : నేను టాప్ 4 హీరో అయితే.. టాప్ 3లో వాళ్లే ఉంటారు.. విశ్వక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

If he is in the top 4 hero they will be in the top 3 Vishwak Sen interesting comments

Vishwak Sen : విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మెకానిక్ రాకీ. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఇక నవంబర్ 22న గ్రాండ్ గా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ సైతం స్టార్ట్ చేశారు మేకర్స్.

ఇందులో భాగంగానే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన చిన్నతంలో టాప్ 4 స్టార్ హీరోస్ ఎవరంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. అదే ఇప్పుడు మీరు టాప్ 4 హీరోగా ఉంటే మీకంటే ముందు ఉండే టాప్ ముగ్గురు హీరోలు ఎవరనుకుంటున్నారు అని అడిగితే.. సమాధానం చెప్పకుండా ఆలోచనలో పడ్డాడు విశ్వక్. కాసేపటి తర్వాత సమాధానమిస్తూ.. నేను టాప్ 4 హీరో అయితే నాకంటే ముందు టాప్ ముగ్గురు హీరోల్లో సిద్ధు, శేష్, నవీన్ పోలిశెట్టిల పేర్లు తెలిపాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Also Read : Rashmika Mandanna : పుష్ప జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ.. షూటింగ్ ఫొటోస్ షేర్ చేసిన రష్మిక..

ఇకపోతే విశ్వక్ తో సిద్ధు, శేష్, నవీన్ పోలిశెట్టి.. ఈ ముగ్గురు హీరోలకి మంచి బాండ్ ఉందన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ నలుగురు హీరోలు ఒకరి సినిమాలను మరొకరు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇక విశ్వక్ సేన్ హీరోగా నటించిన గత సినిమాలు మంచి విజయాన్ని అందుకోగా మెకానిక్ రాకీ సినిమాతో మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.