Rashmika Mandanna : పుష్ప జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ.. షూటింగ్ ఫొటోస్ షేర్ చేసిన రష్మిక..

Rashmika Mandanna : పుష్ప జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ.. షూటింగ్ ఫొటోస్ షేర్ చేసిన రష్మిక..

Rashmika Mandanna shared the Pushpa movie shooting photos

Updated On : November 15, 2024 / 10:57 AM IST

Rashmika Mandanna : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప 2. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కావడానికి రెడీగా ఉంది. ఇక ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ సైతం స్టార్ట్ చెయ్యనున్నారు మేకర్స్.

Also Read : Puhpa 2 Trailer : పుష్ప ట్రైలర్ నిడివి ఎంతో తెలుసా.. మాస్ మ్యాడ్‌నెస్ అంటూ ట్వీట్..

అయితే తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుష్ప 2 ట్రైలర్ త్వరలోనే రానున్న క్రమంలో పుష్ప సినిమా షూటింగ్ లో జరిగిన పలు విషయాలను పంచుకుంటూ కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఒక్కో ఫోటో షేర్ చేస్తూ ఆ సందర్భంలో ఏం జరిగిందో వివరించింది. ఫస్ట్ పెళ్లి చీరలో, పెళ్లి సెట్ లో ఉన్న ఫోటో పెట్టి శ్రీవల్లి మీ అందరికీ లవ్ పంపుతుందని పేర్కొంది. తర్వాత అల్లు అర్జున్, శ్రీవల్లి రష్యా లో దిగిన ఓ ఫోటో ఉంది. అలాగే సుకుమార్, పుష్ప టీమ్ తో కలిసి ఉన్న ఫోటోలు పెట్టి పుష్ప గ్యాంగ్ తో ఉన్న ఏకైక ఫోటో అని, తర్వాత ఫస్ట్ టెస్ట్ లోని ఫోటో ఇదని, సామీ సాంగ్ షూటింగ్ లోని ఫోటోలు షేర్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)


తర్వాత తన హెయిర్ స్టైల్, తన రెండు డిఫెరెంట్ కళ్ళ ఫోటో పెట్టి.. నా నల్ల కళ్ళ కోసం లెన్స్ వాడడంలేదు. రెండు కళ్లు సేమ్ ఉన్నాయా..? అని అడుగుతుంది. అనంతరం శ్రీవల్లి మొదలైంది తిరుపతిలోనే అని మరో ఫోటో షేర్ చేసింది. పుష్ప 2 తో మరింత సంతోషాన్ని కలిగిస్తామని తెలిపింది. దీంతో రష్మిక షేర్ చేసిన ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.