Imtiaz Ali : హైదరాబాద్‌కు వచ్చిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ.. మెయిన్ వాపస్ ఆవుంగా సక్సెస్ మీట్..

జూన్ 12న రిలీజయిన ఈ సినిమా ఆరు వారాలు పూర్తయినా థియేటర్స్ లో నడుస్తుంది. (Imtiaz Ali)

  • Published on- July 22, 2026 / 04:04 PM IST

Imtiaz Ali

Imtiaz Ali : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ ఇటీవల మెయిన్ వాపస్ ఆవుంగా అనే బాలీవుడ్ సినిమాతో ప్రేక్షకుల ఉండును వచ్చాడు. దిల్జిత్ దోసాంజ్, నసీరుద్దీన్ షా, శర్వరి మెయిన్ లీడ్స్ లో వేదాంగ్ రైనా, బనితా సంధు, రజత్ కపూర్, సంజయ్ సూరి, అంజనా సుఖాని.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. 1947 భారతదేశ విభజన సమయంలో జరిగిన ఒక విషాద ప్రేమకథ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న, మతిమరుపు వ్యాధితో బాధపడుతున్న తాతను ఒక మనవడు చూసుకోవడం అనే కథాంశంతో ఈ సినిమాని ఎమోషనల్ గా తెరకెక్కించారు.

జూన్ 12న రిలీజయిన ఈ సినిమా ఆరు వారాలు పూర్తయినా థియేటర్స్ లో నడుస్తుంది. 59 దేశాల్లో 804 స్క్రీన్‌లపై ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం భారతదేశంలో 450కు పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో ప్రదర్శితమవుతోంది. హిందీ రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా.. లాంటి నగరాల్లో కూడా ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది.

Also Read : Balakrishna : హైదరాబాద్‌లో బాలయ్యకు ఆపరేషన్..? నెల రోజుల పాటు షూటింగ్ బంద్..

ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు ఇంతియాజ్ అలీ తాజాగా హైదరాబాద్‌కు వచ్చి ప్రేక్షకులను కలుసుకున్నారు. తమ సినిమాను ఇంతగా ఆదరించి విజయవంతం చేసినందుకు, మెయిన్ వాపస్ ఆవుంగాకు లభిస్తున్న ప్రేమకు ఆనందం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు ఇంతియాజ్ అలీ.