Gani Event: అరవింద్ మామ నీడలా ఉంటూ సపోర్ట్ చేశారంటోన్న వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గని’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే గని చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను ఫుల్ స్వింగ్‌లో..

Gani Event: అరవింద్ మామ నీడలా ఉంటూ సపోర్ట్ చేశారంటోన్న వరుణ్ తేజ్

Gani Event

Updated On : April 6, 2022 / 10:20 PM IST

Gani Event: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గని’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే గని చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను ఫుల్ స్వింగ్‌లో నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. హీరో వరుణ్ తేజ్ కూడా చాలా యాక్టివ్‌గా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నాడు. కాగా తాజాగా ఆయన మీడియాతో మాట్లాడి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.

దర్శకుడు కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ.. గని మూవీని ఒక యుద్ధం లాగా చేశాం. నిర్మాతలు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఉపేంద్ర, జగపతి బాబు, సునీల్ శెట్టి, నదియా పిల్లర్స్ లాంటి వారు.. వాళ్ల చుట్టూ తిరిగే ఎమోషన్స్ ఈ గని సినిమా.

సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. వరుణ్ పడిన కష్టం అతని కళ్ళల్లో కనపడుతుంది. దర్శకుడు కిరణ్ తో జర్నీ… స్ట్రెస్ ఉండదు. అతనితో పని చేయడం చాలా హ్యాపీగా ఉంది. అల్లు బాబీ జడ్జిమెంట్ పర్సన్.. జీనియస్ పర్సన్. బాక్సింగ్ గని కాదు బాక్సాఫీస్ గని అవ్వాలి.

ఉపేంద్ర మాట్లాడుతూ.. మెగాస్టార్ ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. అప్పట్లో చిరంజీవి గారిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. కానీ, నేను చెయ్యలేకపోయా. నాగ బాబు అల్లు అర్జున్‌తో కలసి చేశాను. ఇపుడు వరుణ్‌తో మెగా కుటుంబంతో కలిసి వర్క్ చేసే అవకాశం వచ్చింది. ఇది పెద్ద సక్సెస్ అవుతుంది. కన్నడలో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది అందరూ చూడండి.

సునీల్ శెట్టి మాట్లాడుతూ: అయిదు వేళ్లు మూస్తే పంచ్ అవుతుంది. ఇందులో ఒక వేలు నిర్మాతలు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశారు. రెండు డైరెక్షన్ టీమ్. కిరణ్ బాగా తెరకెక్కించాడు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ ఎంతో హార్డ్ వర్క్ చేశారు. మ్యూజిక్ బ్రిలియంట్ గా ఉంది. అందరూ సినిమాని తప్పక చూడండి.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సినిమా కష్టాలు అంటాం కదా అవి ఈ సినిమాకీ వచ్చాయి. లోపల వున్న కష్టాలు చూశా. దేనికీ తొణకకుండా సినిమాని పూర్తి చేశారు నిర్మాతలు. దర్శకుడు కిరణ్ ప్రతి ఒక్కరి సలహాలు తీసుకొని చేస్తాడు. వరుణ్ తేజ్ ఒక హీరోగా చేస్తూనే ఎంతో బాధ్యతగా సినిమాపై వర్క్ చేశాడు. వరుణ్ కి జ్వరం అయినా కూడా వచ్చాడు. సినిమా అంటే ప్రాణం ఇచ్చేస్తాడు. ఈ సినిమాని మల్టీస్టారర్ సినిమా అనొచ్చు. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు వీళ్ల క్యారెక్టర్ గనికి సపోర్ట్ గా నిలిచాయి. అబ్బూరి రవి అద్భుతమైన డైలాగ్స్ రాశారు. తమన్ మరోసారి మ్యాజిక్ ని ఈ సినిమాలో క్రియేట్ చేశాడు. పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ కు ఉన్నాయి అయినప్పటికీ 8వ తారీఖున కావాలనే చేశాం.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన గని ఫైనల్ గా రిలీజ్ కి వచ్చింది. అందరూ బాగా నటించారు. సునీల్ శెట్టినినీ చూసినప్పుడు నా కోచ్ ఎంత ఫీట్‌గా వుంటే నేను ఎలా వుండాలని రోజు జిమ్ కివెళ్ళాను. ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఆయన తప్ప ఎవ్వరూ చేయలేరు. యంగర్ జనరేషన్ కి అయన ఇన్స్పిరేషన్.. తమన్ నా తొలి ప్రేమకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అదే లెవల్‌లో సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. నిర్మాతలు ఇంకా పెద్ద స్థాయికి వెళ్తారు. అరవింద్ మామ ఒక నీడ లాగా, ఎంతో సపోర్ట్ గా వున్నారు. ఈ సినిమా చెయ్యడానికి కళ్యాణ్ బాబాయి తమ్ముడు సినిమా ఇన్‌స్పిరేషన్. బాబాయ్ ట్రెండ్ సెట్ చేసారు మేం ఫాలో అవుతున్నాం. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నా గట్టి నమ్మకం అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానని తెలిపారు.