Guppedantha Manasu
Guppedantha Manasu : రిషిని కలవడానికి వచ్చిన చక్రపాణిని అతని భార్య సుమిత్ర గురించి అడుగుతుంది దేవయాని. కూతురి పెళ్లికి రాని సుమిత్ర జగతి చనిపోయినప్పుడు కూడా ఎందుకు రాలేదని నిలదీస్తుంది. చక్రపాణి ఏం సమాధానం చెప్పాడు? ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ఏం జరిగింది?
Guppedantha Manasu : మినిస్టర్ ఎంట్రీతో కథలో ట్విస్ట్.. ఎండీగా రిషి బాధ్యతలు చేపడతాడా?
రిషిని కలవడానికి వచ్చిన చక్రపాణిని సుమిత్ర గురించి ప్రశ్నిస్తుంది దేవయాని. కూతురి పెళ్లికి రాకపోవడానికి కారణాలున్నా జగతి చనిపోయినా ఎందుకు రాలేదని ప్రశ్నిస్తుంది. అప్పుడు అసలు రహస్యాన్ని బయటపెడతాడు చక్రపాణి. తన భార్య సుమిత్ర జగతి కంటే ముందే చనిపోయిందని ఈ విషయాన్ని వసుధర చెప్పవద్దని మాట తీసుకోవడం వల్లే తాను నిజం చెప్పలేదని బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అతను చెప్పిన సమాధానం విని రిషి, దేవయాని షాకవుతారు.
తల్లిని తల్చుకుని బాధపడుతున్న రిషికి వసుధర ధైర్యం చెబుతుంది. ఎక్కడైతే నింద పడిందో అక్కడే తిరిగి గౌరవం దక్కించుకోవాలని అంటుంది. అమ్మలేని కాలేజీలోకి అడుగుపెట్టలేను అంటాడు రిషి. తల్లిని పోగొట్టుకుని పైకి ధైర్యంగా తిరిగే వసుధరని కాదు నేను అంటాడు రిషి. తల్లి చనిపోయిన విషయం రిషికి తెలిసిపోయిందని అర్ధమై కన్నీరు పెట్టుకుంటుంది వసుధర. తల్లి సుమిత్ర చనిపోయిన విషయాన్ని తాను ఎందుకు దాచాల్సి వచ్చిందో రిషికి వివరంగా చెబుతుంది వసుధర.
రిషి వసుధర పట్ల గతంలో ప్రవర్తించిన తీరుకి క్షమాపణ అడుగుతాడు. ఎప్పుడూ పంతంతోనే ఉంటాననుకున్నావా?.. నీలాంటి అమ్మాయి దక్కడం నా అదృష్టం అంటాడు. ఏ బంధం మనల్ని ఇక వేరు చేయలేదు.. నిన్ను ఇకపై ఏ స్ధాయిలో ఉంచాలో తెలుసు అంటాడు. నాకు ఏ స్ధాయిలు వద్దు నా పక్కన మీరుంటే చాలు రిషి అంటుంది వసుధర. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే? నెక్ట్స్ ఎపిసోడ్ వరకూ ఎదురుచూడాల్సిందే. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ నటిస్తున్నారు. కాపుగంటి రాజేంద్ర ఈ సీరియల్‌ను డైరెక్ట్ చేస్తున్నారు.