Shaakuntalam : 3 కోట్ల నగలతో, 30 కేజీల బరువుతో సమంత శాకుంతలం షూటింగ్..
సమంత నటిస్తున్న మైథలాజికల్ డ్రామా 'శాకుంతలం'. ఈ మూవీలో సమంత వజ్రాలతో కూడిన నగలు, ముత్యులతో కూడిన చీర ధరించి..
- gum 95921
- Published On : January 30, 2023 / 12:59 PM IST
Shaakuntalam
Shaakuntalam : గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలు కారణంగా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్ళీ తిరిగి షూటింగ్స్ కి హాజరవుతుంది. హిందీ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో నార్త్ లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న సమంత.. మరోసారి ఫ్యామిలీ మ్యాన్ దర్శకులతో కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్. ఇటీవలే ఈ సిరీస్ మొదలు కాగా, సమంత షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ షెడ్యూల్ పూర్తి అవ్వగానే విజయ్ దేవరకొండతో చేస్తున్న ‘ఖుషి’ షూటింగ్ లో కూడా పాల్గొనుంది. ఇప్పటికే ఈ మూవీ సగ భాగం షూటింగ్ జరుపుకుంది. సమంత ఆరోగ్య పరిస్థితి కారణంగా మధ్యలో ఆగిపోయింది.
Shaakuntalam: శాకుంతలం డిజిటల్ రైట్స్.. భారీ రేటుకు సొంతం చేసుకున్న ప్రైమ్..?
కాగా సమంత నటించిన మరో సినిమా ‘శాకుంతలం’. హిందూ ఇతిహాసాలు ఆధారంగా మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత లీడ్ రోల్ చేస్తుంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ లోని విజువల్స్ ఆడియన్స్ లో అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ మూవీలో సమంత లుక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఈ మూవీలోని సమంత లుక్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ ఫొటోలో సమంత వజ్రాలతో కూడిన నగలు, ముత్యులతో కూడిన చీర ధరించి కనిపిస్తుంది. ఆ నగలు ధర దాదాపు 3 కోట్లు అని తెలుస్తుంది.
ఇక ఆమె ధరించిన చీర, నగలు మొత్తం కలిపి 30 కేజీల బరువు ఉన్నాయి అంటా. అంత బరువు ఉన్నా ఆ బాధని పేస్ లో కనపడకుండా దాదాపు ఏడు రోజులు పాటు షూటింగ్ చేసిందట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆమె డెడికేషన్ కి సలాం అంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ చిత్రాన్ని గుణశేఖర్ కూతురు నీలిమా నిర్మిస్తుంది. మలయాళ నటుడు దేవ్ మోహన్, అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ, మోహన్ బాబు, మధూ, గౌతమి, అధితి బాలన్ మరియు అనన్య నాగళ్ల ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
??????????? ?????????? in all her glory ?✨
The regal jewellery of #Shaakuntalam designed by #VasundharaDiamondRoof ?@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan @neelima_guna #ManiSharma @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/qp69YxI80l
— Gunaa Teamworks (@GunaaTeamworks) January 29, 2023
