మా తుజే సలామ్.. అంటూ ఫొటో పోస్ట్ చేసిన షబానా అజ్మీ

షబానా అజ్మీ గుండెను తట్టిలేపే ఫొటో ఒకటి పోస్ట్ చేశారు. రెహమాన్ పాటలో లైన్ ను అప్పుతీసుకుంటున్నానంటూ మా తుజే సలామ్ అని ఓ తల్లి కష్టాన్ని పోస్టు చేశారు. పసిబిడ్డను కొంగులో ఊయలగా కట్టుకుని నెత్తి మీద ఇటుక రాళ్లు మోస్తున్న ఫొటోను పోస్టు చేశారు. పిక్చర్ పాతదే అయినా.. యాక్టర్ షబానా అజ్మీ పోస్టు చేసిన తర్వాత దానికి మరింత క్రేజ్ వచ్చింది.

ఆరు ఇటుకలను నెత్తి మీద పెట్టుకుని.. భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్న మహిళ.. భుజాలపై నుంచి చీరను ఊయలగా మార్చి కొడుకును మోస్తూనే ఇటుకలను బ్యాలెన్స్ చేస్తూ కనిపించింది. ఈ ఫొటోను షేర్ చేస్తూ.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి అజ్మీ షబానా మా తుజే సలామ్(సెల్యూట్ టు మదర్స్) ఫొటోను షేర్ చేశారు.

గురువారం మధ్యాహ్నమే షేర్ చేసిన ఈ ఫొటోకు 5వేల లైకులు వచ్చాయి. వందల మంది దీనిని రీట్వీట్ చేశారు. చైల్డ్ కేర్ డ్యూటీలతో పాటు, కార్మికురాలిగానూ తన పనిని విస్మరించడం లేదని పేదరికం గురించి పోస్టులో పేర్కొంటున్నారు.

 

తప్పులను ఎత్తిచూపకూడదు. వ్యవస్థ మార్పు కోసం ప్రయత్నించాలని ఓ ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశారు. పేదరికానికి దీనికి ఎంతటి వ్యత్యాసముంది. కొద్ది రోజుల తర్వాతనైనా సరే పనిచేసుకోవడానికి మంచి పరిస్థితులు వస్తాయని ఆశిస్తున్నానని ఒకరు కామెంట్ చేశారు.