Bharateeyudu 2 : విజయవాడలో ఇండియన్ 2 షూటింగ్.. రెండు భాగాలుగా సినిమా..
ఇంకా కొనసాగతున్న ఇండియన్ 2 షూటింగ్. రెండు భాగాలుగా రాబోతుందట. ప్రస్తుతం విజయవాడలో..
- gum 95921
- Published On : November 8, 2023 / 05:46 PM IST
Indian 2 shooting in vijayawada and film release updates news
Indian 2 : కమల్ హాసన్ హీరోగా శంకర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘భారతీయుడు’. ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో హీరో సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఇటీవల ఈ మూవీ డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పడంతో షూటింగ్ చివరి దశకు వచ్చింది అందుకున్నారు.
అయితే ఈ మూవీ షూటింగ్ ఇంకా చాలా ఉందట. నిజానికి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. అయితే ఎడిటింగ్ టేబుల్ మీదకి సినిమా వచ్చినప్పుడు చాలా ఎక్కువ రన్ టైంతో వచ్చిందట. దానిని కట్ చేయడానికి కూడా పెద్దగా ఆస్కారం లేకపోవడంతో.. రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారట. ఇండియన్ 2, ఇండియన్ 3 గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయట. ఇప్పుడు ఈ ఇండియన్ 3కి సంబంధించిన షూటింగే జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ విజయవాడలో జరుగుతుంది.
Also read : Radha : కూతురి పెండ్లి పిలుపుల్లో రాధా.. చాలా ఏళ్ళ తరువాత రాఘవేంద్రరావుని కలిసి..
#Indian2 #KamalHaasan #Shankar Shooting Spot pic.twitter.com/9TjkVVjLr2
— VISHWASAI ✨ (@VishwasaiG) November 8, 2023
కమల్ హాసన్ లేని సన్నివేశాలను శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ ఇండియన్ 3 షూటింగ్ కోసం కమల్ హాసన్ ని 40 రోజులు కాల్‌షీట్స్ అడిగారట. అందుకు కమల్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. ఇక ఇండియన్ 2ని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అలాగే ఇండియన్ 3ని వచ్చే ఏడాది చివరిలో రిలీజ్ చేయనున్నారట. అయితే ఈ రిలీజ్ వార్త రామ్ చరణ్ అభిమానులను భయపెడుతుంది. ఈ సినిమా షూటింగ్ వల్ల గేమ్ ఛేంజర్ చిత్రీకరణ లేటు అవుతూ వస్తుంది. ఇప్పుడు ఇండియన్ 3కి మరో నలభై రోజులు అంటే గేమ్ ఛేంజర్ సంగతి ఏంటని కంగారు పడుతున్నారు.
