Cannes 2023 : ఈ సారి కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మెరుస్తున్న ఇండియన్ తారలు.. ఫస్ట్ టైం ఎవరెవరో తెలుసా?

76వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. మే 16 నుంచి మే 27 వరకు ఈ ఫిలిం ఫెస్టివల్ గ్రాండ్ గా జరగనుంది. ఈసారి కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ డిప్యూటీ మినిస్టర్ L మురుగన్ ఇండియన్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

indian celebrities in Cannes 2023 sara alikhan manushi chiller sunny leon anushka sharma mrunal thakur

Indians in Cannes : ప్రతి సంవత్సరం ఫ్రాన్స్(France) లో చాలా ఘనంగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుందని అందరికి తెలిసిందే. పలు దేశ విదేశాల నుంచి అనేకమంది నటీనటులు, టెక్నీషియన్స్ వస్తారు. అనేక దేశాల నుంచి పలు సినిమాలను కాన్స్ ఫిలిం ఫెస్టివల్(Cannes Film Festival) లో స్క్రీనింగ్ చేస్తారు. ఈ ఫెస్టివల్ కు మన ఇండియా(India) నుంచి కూడా చాలా మంది వెళ్తారు. పలు ఇండియన్ సినిమాలు కూడా కాన్స్ లో స్క్రీనింగ్ చేస్తారు.

76వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. మే 16 నుంచి మే 27 వరకు ఈ ఫిలిం ఫెస్టివల్ గ్రాండ్ గా జరగనుంది. ఈసారి కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ డిప్యూటీ మినిస్టర్ L మురుగన్ ఇండియన్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి ఇండియా నుంచి సారా అలీఖాన్, ఈషా గుప్తా, మానుషీ చిల్లర్, ఊర్వశి రౌతేలా, అనుష్కా శర్మ, మృణాల్ ఠాకూర్, సన్నీ లియోన్, ఆండ్రియా కెవిచుసా, గునీత్ మోంగా, షానన్ K, డాలి సింగ్ మధుర్ భండార్కర్, అదితిరావు హైదరి, విజయ్ వర్మ, అనురాగ్ కశ్యప్, మరికొంతమంది టెక్నీషియన్స్ పాల్గొంటున్నారు.

Kangana Ranaut : కంగనా, అతను విడిపోవాలని చాలా మంది అనుకున్నారు.. కంగనా రిలేషన్ పై నటుడి తండ్రి వ్యాఖ్యలు..

అయితే వీరిలో అందమైన భామలు.. సారా అలీఖాన్, మానుషీ చిల్లర్, అనుష్క శర్మ, మృణాల్ ఠాకూర్, షానన్ K, ఆండ్రియా కెవిచుసా, ఈషా గుప్తా, డాలి సింగ్, సన్నీ లియోన్ తొలిసారి పాల్గొనబోతున్నారు. పలువురు టెక్నీషియన్స్ కూడా మొదటిసారి ఈ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంటున్నారు. ఇక కాన్స్ లో పాల్గొనే హీరోయిన్స్ మీదే అందరి కళ్ళు ఉంటాయి. వాళ్ళు వేసే రకరకాల డ్రెస్సులు, ఆ డ్రెస్సుల్లో కాన్స్ రెడ్ కార్పెట్ పై నడవడం, డిఫరెంట్ డ్రెస్సుల్లో ఫొటోలు.. ఇవన్నీ వైరల్ అవుతాయి. ఇప్పటికే కాన్స్ లో ఎంట్రీ ఇచ్చిన మన ఇండియన్ హీరోయిన్స్ తమ స్టైల్ లో కొత్త కొత్త డ్రెస్సులతో పోజులు ఇచ్చేశారు.