Rajinikanth: సూపర్ స్టార్ కోసం ఇంట్రెస్టింగ్ స్టోరీ.. సాహసం చేస్తారా?
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు సక్సెస్ కోసం వేట ప్రారంభించారు. కెరీర్ లో ఎన్నో సక్సెస్ మైలురాళ్లును చూసిన ఆయనకు ఈ మధ్య కాలం సరైన కథ దొరకడం లేదు. ఎప్పటికప్పుడు బ్యాక్ టూ రజనీ..
- Naresh Mannam
- Published On : December 21, 2021 / 05:58 PM IST
Rajinikanth
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు సక్సెస్ కోసం వేట ప్రారంభించారు. కెరీర్ లో ఎన్నో సక్సెస్ మైలురాళ్లును చూసిన ఆయనకు ఈ మధ్య కాలం సరైన కథ దొరకడం లేదు. ఎప్పటికప్పుడు బ్యాక్ టూ రజనీ అనే హోప్ తో సినిమాలు వస్తున్నా తీరా థియేటర్లలోకి వచ్చేసరికి ఉసూరుమనిపిస్తున్నాయి. తమిళనాట ఆయనకున్న క్రేజ్ తో కాస్త పర్వాలేదనిపించినా మిగతా బాషలలో రజినీ సినిమాలకు ఆదరణ తగ్గిపోతుంది. ఈ మధ్యనే ఎన్నో ఆశలతో సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన అన్నాత్తై కూడా భారీ ప్లాప్ మూటగట్టుకుంది.
ArjunaPhalguna: ఒక తీయని మాటతో కళ్ళు మెరిసే.. మరో లిరికల్ సాంగ్ విడుదల
కబాలి, కాలా, పెట్టా, దర్బార్, అన్నాత్తై ఇలా అన్ని సినిమాలు ఎన్నో అంచనాలతో.. భారీ స్థాయిలో విడుదలై చివరికి ఇంతేనా అనిపించేశాయి. దీంతో రజిని తర్వాత సినిమా ఏంటి.. ఎలా ఉండబోతుందన్నది ఆయన అభిమానులకు ఆసక్తిగా మారింది. కాగా.. ప్రస్తుతం రజని అన్నాత్తై దర్శకుడు శివకి మరో అవకాశం ఇచ్చాడని వినిపిస్తుండగా మరో ఇద్దరు దర్శకులతో కథా చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. అందులో ఒకరు కార్తీక్ సుబ్బరాజు కాగా మరొక దర్శకుడు బల్కి. కార్తిక్ గతంలో పెట్టా సినిమా తెరకెక్కించగా ఇది ఆయనకి రెండో అవకాశమే అవుతుంది.
F3 Movie: భీమ్లా దెబ్బ.. వాయిదా పడిన ఎఫ్-3!
కాగా, బల్కి మాత్రం ఓ వైవిధ్యమైన కథను వినిపించినట్లు తెలుస్తుంది. రజని మార్క్ యాక్షన్ సీన్స్ లేకుండా కంప్లీట్ రియలిస్టిక్ డ్రామాలా.. కేవలం నటీనటుల పెర్ఫామెన్స్ ఆధారంగా ఈ కథ ఉంటుందని అందుకే రజనీ కూడా ఈ కథపై ఆసక్తిగా ఉన్నట్లు వినిపిస్తుంది. అయితే.. ఒకవిధంగా ఇది రజనీకి సాహసమే. ఎందుకంటే రజనీ అంటేనే స్టైల్, యాక్షన్. మరి అవి రెండు లేకుండా సినిమా అంటే అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఆలోచించాల్సిందే. అయితే.. రజనీ అనుభవంతో ఇలాంటి కథను రక్తికట్టించడం పెద్ద కష్టమేమీ కాదనేవాళ్ళు లేకపోలేదు. మరి ఈ సినిమా ఏమవుతుందో చూడాలి.
