Inti number 13 : ప్రీమియర్స్‌లో ఓ రేంజ్‌లో భయపడిన ఆడియన్స్.. ‘ఇంటి నెం.13’ మూవీ ఆడియన్స్ రియాక్షన్స్..

'ఇంటి నెం.13' మూవీ ప్రీమియర్స్‌లో ఆడియన్స్ ని ఓ రేంజ్ లో బయపెట్టేసింది. సినిమా చూసిన వారి రియాక్షన్ ఏంటంటే..

Inti number 13 Movie Special premier show Audience Reactions

Inti number 13 : కాలింగ్‌ బెల్‌, రాక్షసి లాంటి హారర్ సినిమాలు తెరకెక్కించిన పన్నా రాయల్ ఇప్పుడు ‘ఇంటి నెం.13’ సినిమాతో రాబోతున్నాడు. నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఆనంద్‌రాజ్‌, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్‌.. పలువురు ముఖ్య పాత్రలతో హారర్ క్రైం థ్రిల్లర్ గా ఈ ఇంటి నెం.13 సినిమా పన్నా రాయల్ దర్శకత్వంలో రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై డా. బర్కతుల్లా సమర్పణలో హేసన్‌ పాషా ఈ సినిమాని తెరకెక్కించారు.

ఈ ఇంటి నెం.13 సినిమా రేపు మార్చ్ 1న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ తో ఈ సినిమా భయపెట్టడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ముందే ఈ ఇంటి నెం.13 సినిమాని కొంతమంది యువకులకు ప్రీమియర్స్ వేసి వారి రియాక్షన్స్ షూట్ చేశారు. హారర్ సినిమా కావడంతో ప్రేక్షకులు భయపడుతున్న రియాక్షన్స్ ని షాట్ చేసి ఈ సినిమా ఎంత భయపెడుతుందో ప్రమోషన్స్ లో తెలియచేస్తున్నారు.

Also read : Kangana Ranaut : పాలిటిక్స్‌లోకి రావడానికి ఇదే సరైన సమయం అంటున్న కంగనా..

దీంతో ఈ రియాక్షన్స్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ప్రమోషన్స్ కూడా డిఫరెంట్ గా చేశారు ఈ సినిమా యూనిట్. కొన్ని షాపింగ్ మాల్స్ లో ఇంటి నెం.13 ఫ్లకార్డులు పట్టుకొని వివిధ గెటప్స్ తో ప్రేక్షకులని భయపెట్టారు. మరి ఈ హారర్ సినిమా రేపు థియేటర్స్ లో ప్రేక్షకులని ఏ రేంజ్ లో భయపెట్టిందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు