Raaka : రాకా సీక్వెల్ మీద క్లారిటీ వచ్చినట్టేనా..?
అల్లుఅర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న రాకాపై (Raaka) మరో ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ అవుతోంది.
- Thota Vamshi Kumar
- Published on- October 6, 2026 / 02:46 PM IST
Is Allu Arjun Raaka to release in 2 parts
Raaka : అల్లుఅర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న రాకాపై మరో ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ అవుతోంది. ఈ సినిమా కథ పరిధి, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ గ్రాండియర్‌ను దృష్టిలో పెట్టుకుని ఒకే పార్ట్‌లో కాకుండా సీక్వెల్ తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. కథను కుదించకుండా, అట్లీ మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సరికొత్తగా, విజువల్, యాక్షన్ వండర్‌గా తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాకా కోసం దాదాపు రూ.1000 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారనే ప్రచారం సినిమాపై అంచనాలను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తోంది. ఇంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను 2027లో థియేటర్లలోకి తీసుకురావాలని టీమ్ టార్గెట్ పెట్టుకున్నట్టు టాక్. అయితే రెండు భాగాలుగా రిలీజ్ చేస్తారా.? లేక ఒకే పార్ట్‌గా తీసుకొస్తారా.? అనేది మూవీ యూనిట్ అఫీషియల్‌గా క్లారిటీ ఇవ్వలేదు.
Shivathmika Rajashekar : ట్రెక్కింగ్‌లో రాజశేఖర్ కూతురు.. శివాత్మిక ఫోటోలు..
రాకా మూవీలో అల్లుఅర్జున్ త్రిపాత్రిభినయం అంటూ ఆసక్తికరమైన ఇప్పటికే ఓ చక్కర్లు కొడుతోంది. బన్నీ మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నారంటూ టాక్ నడుస్తోంది. మూడు క్యారెక్టర్స్ ఒకటే కథ అనే కాన్సెప్ట్ సినిమాలో మెయిన్ హైలైట్‌గా ఉండబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాను సింగిల్ పార్ట్‌లో తీస్తే స్టోరీని కుదించినట్లు అవుతుందని..పార్ట్-2కు ప్లాన్ చేస్తున్నారట.
సేమ్‌టైమ్ పార్ట్ వన్ ఆకట్టుకున్నట్లు..పార్ట్-2 ఆడియన్స్ నచ్చని మూవీస్ రిజల్ట్‌ను కూడా గుర్తు చేసుకుంటున్నారట. అయితే పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని..మూవీ బడ్జెట్, కంటెంట్..బన్నీ కటౌట్‌కు తగ్గట్లుగా..కథను కొంచెం ఎక్స్‌ప్యాండ్ చేసి టూ పార్ట్స్‌గా తీసుకొస్తారని అంటున్నారు. ఇప్పటివరకు గాసిప్‌గానే ఉన్న రాకా పార్ట్-2పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు పుష్పరాజ్ ఫ్యాన్స్.
