OG 2 : పవన్ ఓజీ-2 సినిమాకు బ్రేకులు పడ్డట్లేనా?
పవన్ కల్యాణ్, సుజీత్ కాంబోలో సక్సెస్ టాక్ తెచ్చుకున్న OG సినిమాకు సీక్వెల్ (OG 2) ప్లాన్ జరుగుతోంది.
- Thota Vamshi Kumar
- Published on- August 5, 2026 / 09:52 PM IST
Is it possible that Pawan OG 2 movie has hit the brakes
OG 2 : పవన్ కల్యాణ్, సుజీత్ కాంబోలో సక్సెస్ టాక్ తెచ్చుకున్న OG సినిమాకు సీక్వెల్ ప్లాన్ జరుగుతోంది. ఓజీ ఈవెంట్‌లోనే పవన్ క్లారిటీ ఇచ్చారు కూడా. స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది. రేపోమాపో స్టోరీని లాక్ చేసి.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఓజీ-2కు బ్రేక్ పడ్డట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఓజీ రిలీజైన వన్ వీక్‌లోనే ఓజీ-2పై టాక్ మొదలవగా..ఇప్పుడు పవన్ భుజానికి సర్జరీ కావడంతో ఓజీ-2 షూటింగ్ స్టార్ట్ కావడానికి టైమ్ పట్టొచ్చని అంటున్నారు. పవన్ వెంటనే డేట్స్ ఇచ్చి..షూటింగ్ సెట్స్ మీదికి వెళ్లే పరిస్థితి లేదని చెబుతున్నారు. డాక్టర్ల సూచనతో రెస్ట్ తీసుకుంటున్న పవన్..ఆ తర్వాత పొలిటికల్‌గా ఫుల్ యాక్టివ్‌గా కానున్నారట. సో ఇంకో ఆరు నెలల తర్వాతే ఆయన భుజం ఆపరేషన్ నుంచి పూర్తిగా కోలుకుంటారని అంటున్నారు. అప్పటివరకు ఏపీలో ఎలక్షన్ హీట్ పెరిగే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ఓజీ-2 వచ్చే ఏడాదిలో కూడా స్టార్ట్ అవడం డౌటేనన్న గుసగుసలు మొదలయ్యాయి.
Ramcharan-Sukumar : హిట్ కాంబో.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు.?
అయితే డైరెక్టర్ సుజిత్ ప్లాన్స్ కూడా మారుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్‌లో OG-2 షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో అది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. దీంతో హీరో నానితో ప్లాన్ చేస్తున్న బడ్లీ రోమియో మూవీని ట్రాక్ ఎక్కించేందుకు రెడీ అవుతున్నాడట సుజీత్.
ఓజీ-2 ప్రాజెక్ట్ ఇంకా స్క్రిప్ట్ వర్క్ స్టేజ్‌లోనే ఉందని, కాస్టింగ్ కూడా ఫైనల్ కాలేదనే ప్రచారం ఉంది. అటు పవన్ ఆపరేషన్ చేయించుకోవడంతో ఫైట్ సీక్వెన్స్‌లు చేసేందుకు టైమ్ పట్టొచ్చు. ఎలా చూసినా ఇప్పట్లో ఓజీ-2 షూట్ స్టార్ట్ అవడం డౌటే అంటున్నారు. ఇంతలోపు నానితో బ్లడీ రోమియో పిక్చర్‌ను కంప్లీట్ చేయాలని సుజీత్ ప్లాన్ బిలో బిజీగా ఉన్నట్లు టాక్. ఇవన్నీ రూమర్స్ మాత్రమే. అధికారిక అనౌన్స్‌మెంట్ వస్తేనే ఓజీ-2..బ్లడీ రోమియో ప్లానింగ్‌పై క్లారిటీ రానుంది.
