Ravi Teja : మాస్ మహారాజ మాస్ లెవెల్ రెమ్యునరేషన్..నిజమేనా.?
ఇరుముడి హిట్ తర్వాత మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) రెమ్యునరేషన్ చుట్టూ ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది.
- Thota Vamshi Kumar
- Published on- September 20, 2026 / 09:31 AM IST
Is Ravi Teja hikes remuneration to after irumudi success
Ravi Teja : ఇరుముడి హిట్ తర్వాత మాస్ మహారాజా రవితేజ రెమ్యునరేషన్ చుట్టూ ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది. ఈ సినిమా సక్సెస్‌తో రవితేజ మార్కెట్‌కు మళ్లీ మంచి ఊపు వచ్చిందని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన తన నెక్స్ట్ సినిమాకు ఏకంగా రూ.40 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.
ఇరుముడి హిట్ అయింది కదా అని ఇక రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్నారా.? అంటూ ఓ వర్గం కామెంట్స్ చేస్తుండగా ప్రతి సినిమా ఇరుముడి కాలేదుగా అని మరికొందరు రవితేజను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారట. దీంతో అసలు రవితేజ నెక్స్ట్ సినిమాకు ఎంత తీసుకోబోతున్నారనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Nani : నాని మాటలు.. ఎందుకీ మంటలు..?
అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మరో వెర్షన్ మాత్రం ఈ ప్రచారానికి భిన్నంగా ఉందట. రవితేజ తన రెమ్యునరేషన్‌ను పెంచలేదని, రూ.40 కోట్ల ఫిగర్ కూడా ఆయన స్వయంగా డిమాండ్ చేసిన మొత్తం కాదని టాక్. ఇరుముడి ఇచ్చిన సక్సెస్ వల్ల ఆయన మార్కెట్‌పై అంచనాలు పెరగడంతోనే ఈ రకమైన చర్చ జరుగుతోందని అంటున్నారు.
అంతేకాదు ఒక సినిమా హిట్ అయిన వెంటనే హీరో రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేశారంటూ ప్రచారం చేయడం కూడా కామన్ అయిపోయిందనే అభిప్రాయం ఉంది. మరి నిజంగానే రవితేజ తన రెమ్యునరేషన్‌ను రూ.40 కోట్లకు పెంచారా.? లేక ఇరుముడి సక్సెస్‌ను బేస్ చేసుకుని సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారమేనా.? దీనిపై రవితేజ టీమ్ నుంచి క్లారిటీ వస్తే కానీ ఈ కామెంట్స్‌కు ఫుల్‌స్టాప్ పడేలా కనిపించడం లేదు.
