Suriya – Prithviraj Sukumaran : పృథ్వీరాజ్ డైరెక్షన్‌లో సూర్య మరో బయోపిక్.. నిజమేనా?
మలయాళ నటుడు మరియు డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ గత నెలలో తమిళ హీరో సూర్యని కలిశాడు. అయితే ఈ మీటింగ్ వెనుక ఉన్న కారణం గురించి ఇప్పుడు ఒక వార్త బయటకి వచ్చింది. అదేంటంటే వీరిద్దరూ కలిసి ఒక సినిమా కోసం పని చేయబోతున్నారు..
- gum 95921
- Published On : February 27, 2023 / 01:04 PM IST
is Suriya doing biopic in Prithviraj Sukumaran direction?
Suriya – Prithviraj Sukumaran : మలయాళ నటుడు మరియు డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్.. ప్రస్తుతం సౌత్ అండ్ నార్త్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ లో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. అక్షయ్ కుమార్ అండ్ టైగర్ ష్రాఫ్ నటిస్తున్న బాలీవుడ్ సినిమాతో పాటు ప్రభాస్ సలార్ లో ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. ఇక నటుడిగా ఈ సినిమాల్లో నటిస్తూనే దర్శకుడిగా తన తదుపరి సినిమాని కూడా పట్టాలు ఎక్కించడానికి సిద్ధం చేస్తున్నాడు. దర్శకుడిగా మారి తెరకెక్కించిన మొదటి మూవీ ‘లూసిఫర్’ చిత్రానికి ఇప్పుడు ప్రీక్వెల్ సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
Suriya 42 : సూర్య సినిమా హిందీ రైట్స్ 100 కోట్లకు అమ్ముడుపోయాయ?
కాగా గత నెలలో తమిళ హీరో సూర్యని, పృథ్వీరాజ్ కలిశాడు. అయితే ఈ మీటింగ్ వెనుక ఉన్న కారణం గురించి ఇప్పుడు ఒక వార్త బయటకి వచ్చింది. అదేంటంటే వీరిద్దరూ కలిసి ఒక సినిమా కోసం పని చేయబోతున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సరిగమ ఇండియా నిర్మాణ సంస్థలో పృథ్వీరాజ్ ఒక ప్రాజెక్ట్ కి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇది బ్రిటానియా బిస్కెట్ ఇండస్ట్రీస్‌కి చెందిన దివంగత పారిశ్రామికవేత్త రాజన్ పిళ్లై బయోపిక్. ఈ ప్రాజెక్ట్ పై స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది అంటూ సరిగమ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సిద్దార్థ్ ఆనంద్ కుమార్ ఇటీవల ప్రకటించారు.
కాగా ఈ ప్రాజెక్ట్ కి సూర్య మరియు జ్యోతిక నిర్మాణ సంస్థ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ సహ-నిర్మాతగా వ్యవహరించ బోతున్నట్లు సమాచారం. అయితే ఈ బయోపిక్ ని సూర్య కేవలం నిర్మించబోతున్నాడా? లేదా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఈ బయోపిక్ లో నటిస్తాడా? అనే దాని పై క్లారిటీ లేదు. అలాగే ఈ బయోపిక్ మూవీగా తెరకెక్కుతుందా? లేదా వెబ్ సిరీస్ గా రాబోతోందా? అనే కన్‌ఫ్యూషన్ కూడా నెలకుంది. మరి ఈ ప్రశ్నలు అన్నిటికి క్లారిటీ రావాలి అంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.
Friends who inspire! ❤️ pic.twitter.com/bSn1FURVsO
— Prithviraj Sukumaran (@PrithviOfficial) January 26, 2023
