Samantha – Chaitanya : ఇద్దరి మధ్య ఏం జరిగింది..?
సమంత సోషల్ మీడియాలో దగ్గరగా ఉన్నట్టే ఉండి.. అక్కినేని ఫ్యామిలీకి దూరంగా ఎందుకుండాల్సి వస్తుంది..?
- sekhar
- Published On : September 23, 2021 / 12:33 PM IST
Samantha Chaitanya
Samantha – Chaitanya: ఏం చెప్పాలనుకుంటోంది.. అసలు ఏం చేయాలనుకుంటోంది.. ఇవే ప్రశ్నలు సామ్ ఫ్యాన్స్‌ను నిద్ర పోనివ్వట్లేదు. సింగిల్‌గా కనిపిస్తోంది.. ఫ్రెండ్స్‌తో మాత్రమే మింగిలవుతోంది. దూరంగా ఉంటూనే మామా అంటూ దగ్గరవుతుంది. అసలే మాత్రం అర్ధంకాని సమంత వ్యవహారం ఎప్పటికి తేలుతుంది?
ANR Jayanthi : ఏఎన్నార్ లివ్స్ ఆన్.. నాగార్జున ఎమోషనల్ వీడియో..
‘ఏఎన్నార్ లివ్స్’ అంటూ నాగ్ పోస్ట్ చేసిన ఈ వీడియోను రీ ట్వీట్ చేసింది సమంత. ‘ఇది చాలా అద్భుతంగా ఉంది మామా’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన కొంతమంది సామ్, చై మధ్య ఏ గొడవా లేదు, ఒట్టి పుకార్లే అని ఆమెను వెనకేసుకొస్తున్నారు. మొన్నామధ్య నాగ్ బర్త్‌డే రోజున కూడా ఇలానే మామా అంటూ విష్ చేసింది. చై షేర్ చేసిన ‘లవ్ స్టోరీ’ ట్రైలర్‌ను రీ షేర్ చేసి వార్తల్లో నిలిచింది సామ్. ఇలా సోషల్ మీడియాలో దగ్గరగా ఉన్నట్టే ఉండి అక్కినేని ఫ్యామిలీకి దూరంగా ఎందుకుండాల్సి వస్తుందో అర్ధం కావట్లేదు చాలా మందికి.
This is so beautiful @iamnagarjuna mama ???❤️ #ANRLivesOn https://t.co/Xt6XQ6rhNu
— S (@Samanthaprabhu2) September 20, 2021
Samantha : గ్యాంగ్‌తో చిల్ అయిన సమంత..
తిరుమల శ్రీవారిని, కాళహస్తీశ్వరుణ్ణి ఒంటరిగానే దర్శించుకుంది సమంత. ఆ టైంలో రూమర్స్ గురించి ఎవరో అడిగితే ‘బుద్ధిలేదా’ అంటూ బరెస్ట్ అయింది. నిజానికి తనవి, చై సినిమాలు రిలీజ్ ముందు ఇలాగే తిరుమలకు వెళ్లొస్తుంది సామ్. మరిప్పుడు ‘లవ్ స్టోరీ’ రిలీజ్ ఉంది కాబట్టి వెళ్లిందా అన్న ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. మరోవైపు ట్రిప్స్‌తో పాటూ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తోంది.
Samantha : ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’.. సమంత ఫైర్..
మళ్లీ మధ్యలో ఏదైనా గుర్తొస్తే ‘నువ్వు నన్ను బాధపెట్టావ్.. నేను నిన్ను బాధపెట్టాను.. వసంతం రావాలంటే శిశిరాన్ని అనుభవించాల్సిందే’ అన్న కొటేషన్స్ కూడా ఇచ్చేస్తుంది. అంటే సామ్ తనవైపు నుంచి ఏ తప్పు లేదని ఇలా ఇన్‌డైరెక్ట్‌గా చెప్తోందా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఓన్లీ ఇలా ఇన్‌స్టా, ట్విట్టర్‌ల ద్వారానే రాయభారం నడుపుతూ స్ట్రాటజిక్ సైలెన్స్ పాటిస్తోంది సమంత.
