Vijay Leo : విజయ్ ‘లియో’లో విజయ్ సేతుపతి ఉన్నాడా?
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. వరిసు మూవీ సక్సెస్ పూర్తి కాకముందే తన తదుపరి సినిమా లియో షూటింగ్ మొదలు పెట్టేశాడు. కాగా ఈ మూవీ సెట్స్ నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది.
- gum 95921
- Published On : February 21, 2023 / 04:14 PM IST
is vijay sethupathi acted in vijay leo movie
Vijay Leo : తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇటీవలే ‘వరిసు’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ మూవీ సక్సెస్ పూర్తి కాకముందే తన తదుపరి సినిమా లియో షూటింగ్ మొదలు పెట్టేశాడు. తన కెరీర్ లో 67వ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా పూర్తీ చేసుకుంది.
Vijay : దసరాకే లియో.. చాలా సంవత్సరాల తర్వాత ఒకే ఇయర్ లో రెండు సినిమాలు..
ప్రస్తుతం ఈ చిత్రం కాశ్మీర్ షెడ్యూల్ జరుపుకుంటుంది. కాగా ఈ మూవీ సెట్స్ నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ సినిమాకి రైటర్ గా వర్క్ చేస్తున్న రత్న కుమార్.. తన ట్విట్టర్ ద్వారా ఒక ఫోటో షేర్ చేశాడు. ఆ ఫొటోలో తను కళ్ళజోడుకి సంబంధించిన ఒక అద్దం పట్టుకొని కనిపిస్తున్నాడు. ఆ ఫోటోకి ‘చనిపోయాడు అనుకోకండి’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. అయితే లోకేష్ కనగరాజ్ గత మూవీ ‘విక్రమ్’ లో విజయ్ సేతుపతి విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ మూవీలో విజయ్ సేతుపతి పెట్టుకొనే కళ్ళజోడు అద్దం, ఇప్పుడు రత్న కుమార్ చేతిలో ఉన్న అద్దం ఒకేలా ఉన్నాయి.
అలాగే విక్రమ్ మూవీలో విజయ్ సేతుపతి చనిపోవడం చూపించలేదు. దీంతో ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఉన్నాడని, ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రత్నకుమార్ పోస్ట్ చూస్తుంటే నిజంగా విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఉన్నాడనే అర్ధమవుతుంది. దీని మీద క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష, విలన్ గా సంజయ్ దత్త్ నటిస్తుండగా.. ప్రియా ఆనంద్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు నటిస్తున్నారు.
Never say die ?#Leo#Kashmir#ShootingDiaries pic.twitter.com/91lnvpTR0Q
— Rathna kumar (@MrRathna) February 19, 2023
