MET GALA: వయెలెట్ డ్రస్ లో ఇషా అంబానీ

  • Publish Date - May 8, 2019 / 07:32 AM IST

న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌, కాస్ట్యూమ్‌ ఇన్‌స్టిట్యూట్  షోలో జ‌రిగే రెడ్ కార్పెట్‌లో పాల్గొనేందుకు మేటి మోడ‌ల్స్ విభిన్న దుస్తుల‌లో హాజ‌రవుతుంటారు. ఈ వేడుకలకు బాలీవుడ్ స్టార్స్ ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణేలు వెరైటీ డ్రెస్ ధరించి హాజరుకాగా.. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ.. సరికొత్త డ్రెస్సుతో అలరించింది. 

ప్రముఖ డిజైనర్ ప్రబల్ గురుంగ్ డిజైన్ చేసిన వయెలెట్ కలర్ గౌన్ ఇషా సూపర్ గా ఉంది.. ఆ ఫోటోలను డిజైనర్ ప్రబల్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు. ఈ డ్రెస్సును తయారు చేయడానికి కనీసం 350 గంటలు పట్టిందట. అంతే కాదు ఆ డ్రెస్సుకు నప్పేలా తన మెడలో అందమైన జ్యుయెలరీని ఇషా ధరించి MET GALA అతిథులను ఆశ్చర్యపరిచింది.