Jabardasth Babu : త్వరలోనే పెళ్లి.. నాకు వార్నింగ్ ఇచ్చి బ్లాక్ చేసిన అమ్మాయే ఇప్పుడు.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ..

జబర్దస్త్ బాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి విషయం గురించి తెలిపాడు. (Jabardasth Babu)

  • Published on- October 9, 2026 / 08:32 PM IST

Jabardasth Babu

Jabardasth Babu : జబర్దస్త్ లో రైటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాబు ఆ తర్వాత ఆర్టిస్ట్ గా కూడా ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు దర్శకుడుగా మారి లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే వెబ్ సిరీస్ తో వచ్చాడు. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా జబర్దస్త్ బాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి విషయం గురించి తెలిపాడు.

Also Read : Latha Rajinikanth : రజినీకాంత్ భార్యకు రాజ్యసభ పదవి..? తమిళ రాజకీయాల్లో చర్చ..

జబర్దస్త్ బాబు మాట్లాడుతూ.. నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను. ఒక్క సినిమా అయినా చేసి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను ఇన్నాళ్లు. ఆ అమ్మాయి పేరు అమూల్య. లోకల్ ఛానల్ లో యాంకర్. లాక్ డౌన్ ముందు టిక్ టాక్ లో రీల్స్ చూసి ఇష్టపడి లైక్, కామెంట్స్ పెట్టేవాడిని. ఆమెకు అప్పట్లోనే ఏడు లక్షలు ఫాలోవర్స్ ఉన్నారు. మెసేజెస్ లు చేసినా పట్టించుకోలేదు. ఒకరోజు హైదరాబాద్ లో సడెన్ గా కనిపించింది. కానీ మాట్లాడలేదు. తర్వాత నాకు జబర్దస్త్ లో కొంచెం ఫేమ్ వచ్చాక తన నంబర్ కనుక్కొని ఫోన్ చేశాను. ఏమనుకుందో ఏమో నా ప్రవర్తన, నా మాటలు నచ్చక బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. వార్నింగ్ కూడా ఇచ్చింది. లాక్ డౌన్ అయ్యాక నేనే మళ్ళీ కాల్ చేస్తే వాళ్ళ తమ్ముడు లిఫ్ట్ చేసి ఆమె నంబర్ ఇచ్చాడు.

అప్పుడు ఆ అమ్మాయి హైదరాబాద్ లో ఉంది. ఫోన్ చేసి మాములుగా మాట్లాడి, కలిసి ఆ తర్వాత మెల్లి మెల్లిగా ట్రావెల్ చేసి లవ్ మొదలయింది. మంచి అమ్మాయి తను. నా కోసం వెయిట్ చేసింది చాలా రోజులు. ఇద్దరి ఇళ్లల్లో ఒప్పుకున్నారు. నా దగ్గర డబ్బులు లేనప్పుడు తనే డబ్బులు పంపించేది. నాకు లక్ష రూపాయలు పెట్టి ఐ ఫోన్ కొనించింది. తన అయిదు నెలల శాలరీ అది. నేను మంచి రీల్స్ చేసుకోడానికి, ఫొటోలు తీసుకోడానికి, జబర్దస్త్ లో ఉంటాను అని చెప్పి నేను వద్దన్నా కొనిచ్చింది. అలాంటి అమ్మాయి రావాలంటే అదృష్టం ఉండాలి అని తెలిపాడు. త్వరలోనే తనని పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపాడు.

Also Read : Ashika Ranganath : షార్ట్ స్కర్ట్‌లో అదరగొడుతున్న ఆషికా రంగనాథ్.. ఫొటోలు..