Jabardasth Hari : ఎర్రచందనం స్మగ్లింగ్‌లో మరోసారి జబర్దస్త్ కమెడియన్ హరి పేరు.. పోలీసుల గాలింపు!

మరోసారి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో జబర్దస్త్ కమెడియన్ హరి పేరు. పుంగనూరు మండలంలోని మొరంపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న 60 లక్షల విలువ గల ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారం వెనుక..

Jabardasth Comedian Hari participated again in red sandal smuggling

Jabardasth Comedian Hari : తెలుగు పాపులర్ టెలివిజన్ కామెడీ షో జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసి కమెడియన్ గా చేసిన హరి.. మంచి ఫేమ్ ని సంపాదించుకున్నాడు. అయితే కమెడియన్ గా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను నవ్విస్తూ వచ్చిన హరి.. చిత్తూరు జిల్లా పోలీసులకు మాత్రం తలనొప్పిగా మారాడు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఇప్పటికే పలు మార్లు పోలీసులకు చిక్కాడు. ఇప్పుడు మరోసారి అతని పేరు వినిపించింది. తాజాగా పోలీసులు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ఒక వ్యక్తిని పట్టుకోగా అతడి వెనుక జబర్దస్త్ హరి ఉన్నట్లు తెలిసింది.

Sapthagiri : సైకిల్ ఎక్కనున్న సినీ నటుడు సప్తగిరి.. చిత్తూరు జిల్లా నుంచి పోటీకి సిద్ధం..

పుంగనూరు మండలంలోని మొరంపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న 60 లక్షల విలువ గల ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కిషోర్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అనంతరం ఈ వ్యవహారం వెనుక జబర్దస్ కమెడియన్ హరి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కమెడియన్ హరి పై ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లో పలు కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం హరి పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Mahesh Babu : మహేష్ బర్త్ డే రోజు రాజమౌళి సినిమా లాంచ్.. ఆమిర్ ఖాన్ నటిస్తున్నాడా..?

కాగా హరి జబర్దస్త్ కంటే ముందు కొన్ని టీవీ సీరియల్స్ లో కూడా నటించాడు. శంభో శంకర సినిమాతో పాటు మరికొన్ని సినిమాలకు ఫైనాన్స్ కూడా చేశాడు. ఇక 2021 లో చిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలోని చీకిమానుకోన అటవీప్రాంతంలో రెడ్‌ శాండల్‌ స్మగ్లింగ్‌ జరుగుతుందన్న విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది దాడులు చేయగా.. మొత్తం ఎనిమిది మంది స్మగ్లర్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ దాడిలో జబర్దస్త్‌ హరి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇక అప్పుడు చిక్కిన ఆ స్మగ్లర్ల నుంచి నాటు తుపాకులను సైతం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

 

ట్రెండింగ్ వార్తలు