Jabardasth comedian Punch Prasad
Jabardasth Punch Prasad health: జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో పంచ్ ప్రసాద్(Punch Prasad ) ఒకరు. ఈయన కామెడీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే.. పంచ్ ప్రసాద్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. రెగ్యులర్‌గా డయాసిస్ చేయించుకుంటున్నారు. చికిత్సతో కోలుకుని కొన్నాళ్లు జబర్దస్త్‌లో కనిపించారు. కాగా ఇప్పడు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు మరో జబర్దస్త్ కమెడియెన్ నూకరాజు(Jabardasth Emmanuel) సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
సాధ్యమైనంత త్వరగా అతడికి ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పినట్లు నూకరాజు తెలిపాడు. అయితే.. అందుకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని, ఈ విషయంలో దాతలు సాయం చేయాలని కోరాడు. ‘అన్నకు సీరియస్‌గా ఉంది. ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. అందుకు చాలా ఖర్చు అవుతుంది. మేమంతా ట్రై చేస్తున్నాం. మీరు కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో నూకరాజ్ పోస్ట్ పెట్టాడు. అందులో ప్రసాద్ భార్య సునీత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాడు.
ఇక యూట్యూబ్ ఛానల్‌లోనూ ఓ వీడియో విడుదల చేశాడు. అందులో నూకరాజ్ మాట్లాడుతూ.. చాలా ఆస్పత్రులను తిరిగినట్లు చెప్పుకొచ్చాడు. అయినప్పటికి ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పులేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రసాద్ రెండు కిడ్నీలు మూడు సంవత్సరాల క్రితమే ఫెయిల్ అయ్యాయని, అప్పటి నుంచి ఆ బాధను అలాగే భరిస్తున్నాడని చెప్పాడు. ఈ సమస్య ఉన్న వారికి ఒకదాని వెంట ఒకటి జబ్బులు వస్తూనే ఉంటాయని,అన్నకి కూడా ఇలాగే జరుగుతోందన్నాడు.
వీలైన త్వరగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని డాక్టర్లు చెబుతున్నారన్నాడు. ‘లేదంటే ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చునని, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు అవుతుంది. మీఅందరిని చేతులెత్తి వేడుకుంటున్నాం. దయచేసి మీకు తోచినంత సాయం చేయండి.’ అని నూకరాజు అన్నాడు.
గతేడాది నవంబర్‌లో పంచ్ ప్రసాద్‌కు సీరియస్ అయిన సంగతి తెలిసిందే.. షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లిన ప్రసాద్ నడవలేక ఇబ్బంది పడడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు కిడ్నీ సమస్య తీవ్రమైందని, నడుము వెనుక వైపు చీము పట్టిందన్నారు. ఆ సమయంలో ఆపరేషన్ చేయడంతో ఆయన కోలుకున్నారు. తిరిగి టీవీ షోలలో కనిపించారు. ఇప్పుడు మరోసారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.