Jabardasth comedian Shanthi kumar turned as Director with Natho Nenu Movie Trailer released by Dil Raju
Natho Nenu Movie Trailer : సాయికుమార్, ఆదిత్యా ఓం, ఐశ్వర్య, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ సాయి, దీపాలి రాజపుత్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న సినిమా నాతో నేను. జబర్దస్త్ కమెడియన్ శాంతి కుమార్ తూర్లపాటి దర్శకుడిగా మారి ఈ సినిమాని తెరకెక్కించాడు. ప్రశాంత్ టంగుటూరి ‘నాతో నేను’ సినిమాని నిర్మించారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలు శ్రోతలను అలరిస్తున్నారు.
ఈ నెల 21న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను అగ్ర నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘నాతో నేను’ ట్రైలర్ ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. ట్రైలర్‌లో ట్రయాంగిల్ ఎమోషన్స్ చూపించారు. చాలా బావుంది. సాయికుమార్ నటన గురించి అందరికీ తెలిసిందే. ఆయనతోపాటు ఆర్టిస్టులు అద్భుతంగా నటించారు. టీమ్‌కి ఆల్ ద బెస్ట్’’ అని అన్నారు.
శాంతికుమార్ మాట్లాడుతూ.. జబర్దస్త్ కమెడీయన్‌గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాటలు, పాటలు నేనే రాసుకుని చక్కని నిర్మాతల సహకారంతో ఈ సినిమా పూర్తి చేశాం. ప్రేమ, భావోద్వేగం అన్ని ఉన్న చిత్రమిది అని అన్నారు.
నాతో నేను చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. ఇటీవల విడుదల చేసిన పాటలు అన్నింటికి చక్కని స్పందన వచ్చింది. ఈ నెల 21 ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాం అని నిర్మాత ప్రశాంత్ టంగుటూరి తెలిపారు.