Jabardasth Faima : సైలెంట్‌గా ప్రియుడితో రిజిస్టర్ ఆఫీస్‌లో పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ఫైమా.. వీడియో వైరల్..

తాజాగా ప్రవీణ్, ఫైమా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకొని అందరికి షాక్ ఇచ్చారు.(Jabardasth Faima)

  • Published on- June 24, 2026 / 05:28 PM IST

Jabardasth Faima

Jabardasth Faima : పటాస్, జబర్దస్త్ షోలతో మంచి ఫేమ్ తెచ్చుకుంది ఫైమా. బిగ్ బాస్ లో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది. కమెడియన్ గా ఫైమా టీవీ షోలు, సినిమాలతో దూసుకుపోతుంది. గతంలో పటాస్ ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నట్టు, తర్వాత విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. కొన్నాళ్ల క్రితం ఫైమా ప్రవీణ్ అనే మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు తనే ప్రకటించింది.

సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ తో క్యూట్, రొమాంటిక్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ వైరల్ అయ్యేది. తాజాగా ప్రవీణ్, ఫైమా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకొని అందరికి షాక్ ఇచ్చారు. రిజిస్టర్ ఆఫీస్ లో దండలు మార్చుకున్న వీడియోని ప్రవీణ్, ఫైమా తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.

Also See : Anchor Manjusha : బుల్లి గౌనులో యాంకర్ మంజూష క్యూట్ లుక్స్..

ఈ వీడియో షేర్ చేసి.. మమ్మల్ని అనుమానించారు. మమ్మల్ని జడ్జ్ చేసారు. కానీ మా ప్రేమ అన్ని అడ్డంకులను, ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలబడింది. వదిలేయడానికి వెయ్యి కారణాలు ఉండొచ్చు కానీ ప్రతిరోజు కలిసి ఉండటానికే నిశ్చయించుకున్నాం. ఇవాళ మేము భార్య భర్తలం అంటూ పోస్ట్ చేసారు. దీంతో ఈ వీడియో వైరల్ అవ్వగా పలువురు టీవీ సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.