Jabardasth Fame Rocking Rakesh KCR Movie Trailer Released
KCR Movie Trailer : జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న రాకింగ్ రాకేష్ హీరోగా, నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా KCR (కేశవ చంద్ర రమావత్). ఎప్పుడో తెలంగాణ ఎన్నికల ముందే రిలీజ్ కావాల్సి ఉన్నా పలు కారణాలతో ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా KCR సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.
Also Read : Sriya Reddy : కష్టపడి కలరిపయట్టు నేర్చుకుంటున్న ‘సలార్’ భామ.. ఏ సినిమా కోసమో.. ఫొటోలు వైరల్..
ఈ ట్రైలర్ చూస్తుంటే.. తెలంగాణలోని ఓ తండా, ఆ తండాలో హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలు, ఆ ఊరికి ఒక సమస్య, తనకు ఒక ప్రేమ సమస్య వస్తే కేశవ చంద్ర రమావత్(రాకేష్) ఏం చేసాడు అని సినిమా ఎమోషనల్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. రాకింగ్ రాకేష్ ట్రైలర్ లోనే తన నటనతో మెప్పించాడు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మీరు కూడా KCR ట్రైలర్ చూసేయండి..
ఇక ఈ సినిమాని స్టార్ సినిమాటోగ్రాఫర్ అంజి డైరెక్షన్ చేస్తుండగా సినిమాలో రాకింగ్ రాకేష్, అనన్య, సుజాత, లోహిత్ కుమార్, తనికెళ్ళ భరణి, జబర్దస్త్ ధనరాజ్.. ఇలా పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.