Jabardasth Naveen C/O Ravindra Bharathi Movie Opening Ceremon Happened
C/O Ravindra Bharathi : హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఎంతోమంది, ఎన్నో రకాల కళాకారులకు కేరాఫ్ అడ్రెస్. రవీంద్రభారతి నుంచి ఎంతోమంది కళాకారులు సినీ పరిశ్రమలోకి కూడా వచ్చారు. ఇప్పుడు ‘కేరాఫ్ రవీంద్రభారతి’ అనే టైటిల్ తోనే సినిమా రాబోతుంది.
అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై టి.గణపతి రెడ్డి నిర్మాతగా, గట్టు నవీన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కేరాఫ్ రవీంద్రభారతి. జబర్దస్త్ జీవన్, గట్టు నవీన్, నవీన, మాస్టర్ రత్నాకర్ సాయి, ప్రణీత.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ నేడు రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్లో మూవీ యూనిట్, మామిడి హరికృష్ణ, డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ .. పలువురు నటీనటులు పాల్గొన్నారు.
Also Read : Pushpa 2 Trailer : అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ వచ్చేసింది.. పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా.. ఇంటర్నేషనల్..
ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. గట్టు నవీన్ నాకు చాలా కాలంగా తెలుసు. బాగా కష్టపడే వ్యక్తి. తన మొదటి సినిమా శరపంజరం ఎలా కష్టపడి తీసారో నాకు తెలుసు. ఎందరో కళాకారుల కల ఈ రవీంద్రభారతి. 60 ఏళ్ల రవీంద్రభారతికి ఒక కళాకారుడు ఇచ్చే కళానీరాజనం సినిమా. ఈ సినిమా మంచి విజయం సాధించాలి అని అన్నారు.
డైరెక్టర్ గట్టు నవీన్ మాట్లాడుతూ.. ఒక్కసారైనా రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలి అని చాలా మంది కళాకారులు అనుకుంటారు. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా రాబోతుంది. హీరో అవ్వాలి అనే నా కళ మొదటి సినిమాతో జరిగింది. ఇప్పుడు నా ప్రెండ్స్ ని హీరోలుగా చేస్తున్నాను అని అన్నారు.