Jabardasth Naresh : బిగ్ బాస్‌లో జబర్దస్త్ నరేష్ ఏజ్ బయటపెట్టిన రామ్ ప్రసాద్.. పెళ్లి సంబంధాలు అంటూ..

నరేష్ ఇంత చిన్నగా ఉన్నా అతని ఏజ్ ఎంత అని అందరికి సందేహం ఉంది.(Jabardasth Naresh)

  • Published on- September 15, 2026 / 10:49 AM IST

Jabardasth Naresh

Jabardasth Naresh : జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న కమెడియన్ నరేష్ ఈసారి బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, హైట్ తక్కువ ఉండటంతో అనేక కష్టాలు పడి, ఒక స్క్రాప్ అమ్ముకునే కుటుంబం నుంచి వచ్చి ఎదిగాడు నరేష్. తన హైట్ నే తాను అడ్వాంటేజ్ గా తీసుకొని కామెడీతో నవ్వించాడు. అయితే నరేష్ ఇంత చిన్నగా ఉన్నా అతని ఏజ్ ఎంత అని అందరికి సందేహం ఉంది.

Also See : Daali Dhananjaya : పుష్ప విలన్.. ధనుంజయ ఫ్యామిలీని చూశారా..? భార్య, కొడుకుతో కన్నడ నటుడు.. ఫొటోలు వైరల్..

ఇటీవల బిగ్ బాస్ లో వీకెండ్ ఎపిసోడ్ రోజు రామ్ ప్రసాద్ నరేష్ ఏజ్ చెప్పేసాడు. నరేష్ తో పాటు జబర్దస్త్ రామ్ ప్రసాద్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి ఆట ఆడుతున్నారు. రామ్ ప్రసాద్ వీకెండ్ ఎపిసోడ్ లో మాట్లాడుతూ.. నరేష్ చిన్నవాడిగా కనిపిస్తాడు కానీ చిన్నోడు కాదు. వీడి ఏజ్ 28 ఏళ్ళు. ఇంట్లో పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు అని తెలిపాడు. దీంతో నరేష్ బిగ్ బాస్ తర్వాత పెళ్లి సంబంధం సెట్ అయితే గ్యారెంటీగా పెళ్లి చేసుకుంటాడని తెలుస్తుంది.