Jagapathi Babu
Jagapathi Babu : జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. జగపతి బాబు చేసిన పాత్రల్లో అరవింద సమేత వీరరాఘవ సినిమాలోని పాత్ర చాలా స్పెషల్. గొంతు కట్ అయి బతికిన పవర్ ఫుల్ విలన్ పాత్రలో జగపతి బాబు జీవించేసాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు క్లైమాక్స్ చాలా ప్లస్ అయింది.(Jagapathi Babu)
తాజాగా జగపతి బాబు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అరవింద సమేత సినిమా క్లైమాక్స్ లో జరిగిన ఆసక్తికర సంఘటన తెలిపారు.
Also Read : Jagapathi Babu : జగపతి బాబుకి మరణగండం.. ముందే తెలుసుకున్న ఆస్ట్రాలజర్.. ఆ రోజు కప్పెట్టేసి..
జగపతి బాబు మాట్లాడుతూ.. అరవింద సమేత వీర రాఘవ సినిమా క్లైమాక్స్ లో మొదట మాములు కమర్షియల్ ఫైట్ పెట్టారు. ఆ ఫైట్ షూటింగ్ కూడా జరిగింది. చెత్త అంతా తీశారు. ఓ నలభై మంది రావడం, ఒకడు వచ్చి కొట్టడం తర్వాత ఇద్దరు కొట్టడం ఇలా ఓ చెత్త ఫైట్ తీశారు. షూటింగ్ కి ఏదో బ్రేక్ వస్తే త్రివిక్రమ్ తో అన్నా ఏంటి శ్రీను నువ్వు కూడా ఈ రొటీన్ క్లైమాక్స్, క్లైమాక్స్ మార్చు నువ్వు క్రియేటివ్ డైరెక్టర్ నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా అన్నాను.
త్రివిక్రమ్ కూడా ఏదో ఆలోచిస్తున్నాడు. ఆ ఫైట్ మొత్తం తీసేసారు. ఓ రెండు రోజులు ఆలోచించి, రామ్ – లక్ష్మణ్ తో కూడా మాట్లాడి క్లైమాక్స్ మొత్తం మార్చేశారు. అది బెస్ట్ క్లైమాక్స్ అయింది అని అన్నారు.
Also Read : Mega Family : బారసాల ఫంక్షన్.. మెగా ఫ్యామిలీ ఫోటో వైరల్.. ఈ ఫొటోలో ఎవరెవరు ఉన్నారో తెలుసా?