Jagapathi Babu : చరణ్ పై ట్రోలింగ్.. గుంటకాడ నక్కలు అంటూ జగపతి బాబు రియాక్షన్..
పెద్ది సినిమాలో జగపతి బాబు అప్పలసూరి అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతునాడు. (Jagapathi Babu)
- Saketh U
- Published on- May 27, 2026 / 01:14 PM IST
Jagapathi Babu
Jagapathi Babu : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న రిలీజ్ కాబోతుంది. మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. పెద్ది యూనిట్ పలు నగరాల్లో భారీ ఈవెంట్స్ నిర్వహిస్తుంది. ఇటీవల భోపాల్ లో పెద్ది ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ పలు పేర్లు మర్చిపోవడం, తర్వాత సారి చెప్తూ ట్వీట్ చేయడం, బెంగళూరు ఈవెంట్లో చరణ్ కొంచెం కొంచెమే కన్నడలో మాట్లాడటంతో కొంతమంది యాంటీ ఫ్యాన్స్ చరణ్ ని ట్రోలింగ్ చేసారు.
పెద్ది సినిమాలో జగపతి బాబు అప్పలసూరి అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతునాడు. ప్రమోషన్స్ లో భాగంగా నేడు జగపతి బాబు మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో చరణ్ పై వచ్చిన ట్రోలింగ్, తనపై వచ్చిన ట్రోలింగ్ గురించి స్పందించారు.
Also Read : Peddi : పీక్స్ కు చేరిన పెద్ది మూవీ క్రేజ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆరోజేనా?
జగపతి బాబు మాట్లాడుతూ.. పనిలేని వెదవల గురించి నేను మాట్లాడను. ట్రోలింగ్ చేసేవాళ్ళు గుంటకాడ నక్కల్లాంటి వాళ్ళు. వాళ్లకు పనిలేక ఎవర్ని కిందకు లాగుదాం అని ట్రోలింగ్ చేస్తారు. అసలు చరణ్ ఈ సినిమాకు ఎంత కష్టపడ్డాడు, ఎన్ని గాయాలు అయ్యాయి, ఎంత ఎఫర్ట్ పెట్టాడు, ఎంత కష్టపడ్డాడు ఇవన్నీ వదిలేసి ఏదో దొరికితే దాన్ని పట్టుకుంటారు.
అసలు ఈవెంట్లో అన్నివేల మంది జనాలు, ఓ పక్క హీరోకి కాల్స్ వస్తున్నాయి. డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ గురించి, సెన్సార్, ఓ పక్క థియేటర్స్ ఇష్యూ నడుస్తుంది ఇవన్నీ హీరో తల మీద ఉంటాయి. అవన్నీ మోస్తూ ఇంత హడావిడిలో మర్చిపోతారు. నేను కూడా మర్చిపోతాను. అంత ప్రెజర్ లో అలాంటివి జరుగుతాయి. అది సహజం. దీన్ని కూడా మాట్లాడాలా. ఆ ట్రోలింగ్ చేసేవాళ్ళు నాలుగు రోజులు మాట్లాడతారు పోతారు. దీనివల్ల చరణ్ కి ఏం కాదు అని అన్నారు.
Also See : Anchor Sreemukhi : సమంత మా ఇంటి బంగారం కోసం.. ముస్తాబయిన శ్రీముఖి.. ఫొటోలు..
ఇక తనపై వచ్చిన ట్రోలింగ్ గురించి స్పందిస్తూ.. నన్ను కూడా ఏదో సీన్ కి 70, 80 టేక్స్ తీసుకున్నా అని ట్రోల్ చేసారు. అసలు అది అబద్దం. నేను మహా అయితే మూడు టేక్స్ తీసుకున్నా ఏమో హైయెస్ట్. దాన్ని కూడా ఫేక్ న్యూస్ తో ట్రోలింగ్ చేసారు అని చెప్పుకొచ్చారు.
