Peddi : పీక్స్ కు చేరిన పెద్ది మూవీ క్రేజ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆరోజేనా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పెద్ది (Peddi).
Gossip Garage Peddi Movie Pre release event may be june 2nd
Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పెద్ది. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి. పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాని వృద్ది సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి.
పెద్ది సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ కాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఇప్పుడు కొన్ని గాసిప్స్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. హైదరాబాద్‌లో జూన్ 2న ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. భారీ సెటప్, స్టార్ స్టడెడ్ గెస్ట్ లిస్ట్, ఫ్యాన్స్‌కు ప్రత్యేక ఎంటర్టైన్మెంట్ కలిపి ఈ వేడుకను పెద్ద సెలబ్రేషన్‌లా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది.
Ranveer Singh: ధురంధర్ నటుడిపై నిషేధం.. ఇండస్ట్రీ నుంచి బ్యాన్.. ‘డాన్ 3’ వివాదంలో సంచలన నిర్ణయం
ఈ ఈవెంట్ ద్వారా సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసి రిలీజ్‌కు ముందు భారీ మైలేజ్ సంపాదించాలనే ఆలోచనలో ఉన్నారట. దీనిలో భాగంగా స్పెషల్ గెస్ట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను ఆహ్వానించాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. బన్నీ హాజరైతే ఈ ఈవెంట్ రేంజ్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడం ఖాయం అని ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. అలాగే ఆయన స్పీచ్, ప్రెజెన్స్ ఈ సినిమాకు అదనపు హైప్ తీసుకురాగలదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే అధికారిక ప్రకటన వచ్చేవరకు క్లారిటీ లేదు కానీ.. ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్‌లో ఎగ్జైట్మెంట్ పెంచుతోంది.
