Jagapathi Babu : అభిమానులకు జగ్గూభాయ్ సీరియస్ నోట్.. ఇక సెలవు..
సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చాలా దగ్గరగా ఉండే ఈ హీరో.. ఇప్పుడు తన ఫ్యాన్స్ కి ఒకస్ సీరియస్ నోట్ రిలీజ్ చేశాడు. ఇక సెలవు నాకు మీతో ఇక సంబంధం లేదంటూ
- gum 95921
- Published On : October 8, 2023 / 11:49 AM IST
Jagapathi Babu released serious note for his fans gone viral
Jagapathi Babu : ఒకప్పటి ఫ్యామిలీ హీరో జగపతి బాబు ప్రస్తుతం విలన్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ రోల్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చాలా దగ్గరగా ఉండే ఈ హీరో.. ఇప్పుడు తన ఫ్యాన్స్ కి ఒకస్ సీరియస్ నోట్ రిలీజ్ చేశాడు. ఇక సెలవు నాకు మీతో ఇక సంబంధం లేదంటూ, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటూ పేర్కొన్నాడు. ఇంతకీ జగ్గూభాయ్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న కారణం ఏంటి..? అసలేం జరిగింది..?
జగపతిబాబు తన అభిమానుల కోసం కొన్ని సేవ కార్యక్రమాలు చేస్తుంటాడు. అయితే ఇప్పుడు వాటిని విరమించుకొంటునట్లు వెల్లడించాడు. 33 ఏళ్ల కెరీర్ లో తన కుటుంబంలా తన అభిమానులు కూడా తన పెరుగుదలకి ముఖ్యకారణమని భావించినట్లు, ఈక్రమంలోనే అభిమానుల కష్టాల్ని తన కష్టాలుగా భావించి ఇన్నాళ్లు వాళ్ళకి తనవంతు సాయం చేస్తూ వచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు ఆ అభిమానుల నుంచి జగపతి బాబుకి ఇబ్బందులు ఎదురవుతున్నాయట.
Also read : Varun – Lavanya : ఈసారి చిరు కాదు ఉపాసన లీక్ చేసింది.. వరుణ్, లావణ్య పెళ్లి వేడుక అక్కడే..
“అభిమానులంటే అభిమానం ప్రేమ ఇచ్చేవాళ్ళని మనస్ఫూర్తిగా నమ్మాను, కానీ బాధాకరణమయిన విషయం ఏంటంటే కొంతమంది అభిమానులు ప్రేమ కంటే ఆశించటం ఎక్కువ అయిపోయింది, నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకువచ్చారు మనసు ఒప్పుకోకపోయినా బాధతో చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఇక నుంచి నాకు, నా అభిమాన సంఘాలకు, ట్రస్ట్ కి ఉన్న సంబంధం విరమించుకుంటున్నాను. అయితే కేవలం ప్రేమించే అభిమానులకి నేను ఎప్పుడు తోడుగా ఉంటాను” అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ నోట్ వైరల్ గా మారింది.
నా అభిమానులకు మనవి…. pic.twitter.com/iLN9tToL7T
— Jaggu Bhai (@IamJagguBhai) October 7, 2023
