Jagapathi Babu : జగపతి బాబుకి మరణగండం.. ముందే తెలుసుకున్న ఆస్ట్రాలజర్.. ఆ రోజు కప్పెట్టేసి..
తాజాగా జగపతి బాబు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఉన్న మరణగండం గురించి ఆశ్చర్యపోయే సంఘటన చెప్పారు.(Jagapathi Babu)
- Saketh U
- Published On : February 13, 2026 / 04:35 PM IST
jagapathi babu
Jagapathi Babu : ఒకప్పటి స్టార్ హీరో జగపతి బాబు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా జగపతి బాబు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఉన్న మరణగండం గురించి ఆశ్చర్యపోయే సంఘటన చెప్పారు.(Jagapathi Babu)
Also Read : Mega Family : బారసాల ఫంక్షన్.. మెగా ఫ్యామిలీ ఫోటో వైరల్.. ఈ ఫొటోలో ఎవరెవరు ఉన్నారో తెలుసా?
జగపతి బాబు మాట్లాడుతూ.. ఓ సినిమా షూటింగ్ లో నన్ను అండర్ గ్రౌండ్ లో పెట్టారు. పైన మట్టేసి కప్పేశారు. దానిపైన ఒక మండపం వేశారు. తీయాల్సిన దానికంటే కొన్ని సెకండ్స్ లేట్ అయింది. లోపల ఆక్సిజన్ లేదు. అప్పటికే నేను బ్రీతింగ్ టెక్నిక్ వాడి బ్రీత్ కొంచెం కొంచెం తీసుకున్నాను. నన్ను లోపల్నించి లేట్ గా తీశారు. నేను లేట్ గా కళ్ళు తెరిచాను. అప్పటికే నేను పోయాను అనుకోని అందరూ ఏడుస్తున్నారు.
అదే రోజు ఈ సీన్ కంటే ముందు పొద్దునే ఒక కాల్ వచ్చింది. గతంలో నాకు పరిచయం అయిన ఒక లేడీ ఆస్ట్రాలజర్ ఫోన్ చేసి బాగానే ఉన్నారా అని అడిగింది బాగానే ఉన్నాను ఏమైంది అంటే జాగ్రత్త అని చెప్పింది. ఆ తర్వాత ఈ సంఘటన తెలిసి మళ్ళీ కాల్ చేసి మీకు మరణగండం ఉంది మీరు పోవాల్సింది, పోతారని భయం వేసి పొద్దున్న కాల్ చేసి మీకు జాగ్రత్త చెప్పాను అని చెప్పిందని అన్నారు.
Also Read : Star Actor : ఒకప్పటి స్టార్ హీరో, ఇప్పుడు స్టార్ నటుడు ఇలా అయిపోయాడేంటి.. ఫోటో వైరల్..
