Suriya : మరో గౌరవం దక్కించుకున్న ‘జై భీమ్’
ఇప్పటికే ఎన్నో రికార్డులను సాధించిన 'జై భీమ్' సినిమా తాజాగా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ప్రతిష్టాత్మక నోయిడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ - 2022కు 'జై భీమ్' సినిమా అధికారికంగా..
- Saketh U
- Published On : January 20, 2022 / 09:59 AM IST
Jai Bheem (1)
Jai Bheem : కమర్షియల్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు డిఫరెంట్ రోల్స్‌లో కూడా జనాల్ని అలరిస్తున్న సూర్య ఇటీవల వరుసగా డిఫరెంట్ సినిమాలతో ఓటీటీలలో తన సినిమాలు రిలీజ్ చేసి విజయాలు సాధిస్తున్నాడు. గత సంవత్సరం దీపావళికి సూర్య నటించిన చిత్రం ‘జైభీమ్’ రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. అమెజాన్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా దేశంలోనే కాక విదేశాల నుంచి కూడా అభినందనలు పొందుతుంది.
‘జస్టిస్ చంద్రు’ అనే లాయర్ జీవిత కథతో పాటు అతను డీల్ చేసిన ఓ ఆదివాసుల కేసు ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా అనేక రికార్డులని సాధించింది. ఐఎండీబీ రేటింగ్స్‌లో హాలీవుడ్ సినిమాలని దాటి 9.6 రేటింగ్ కూడా సాధించింది. అలాగే గోల్డెన్ గ్లోబ్ 2022 పురస్కారానికి కూడా నామినేట్ అయింది ‘జై భీమ్’ సినిమా. అంతే కాక అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్) అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ‘సీన్ ఎట్ ది అకాడమీ’ పేరుతో ఈ సినిమాలోని సీన్స్ గురించి చెప్తూ ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు.
Konchada Srinivas : షూటింగ్ లో ప్రమాదం.. సినీ నటుడు మృతి
ఇలా ఇప్పటికే ఎన్నో రికార్డులను సాధించిన ‘జై భీమ్’ సినిమా తాజాగా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ప్రతిష్టాత్మక నోయిడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ – 2022కు ‘జై భీమ్’ సినిమా అధికారికంగా ఎంపిక కాబడింది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో చిత్ర యూనిట్, సూర్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
#JaiBhim has been officially selected into the Noida International Film Festival 2022@Suriya_offl #Jyotika @tjgnan @rajsekarpandian @2D_ENTPVTLTD @PrimeVideoIN @prakashraaj @RSeanRoldan @jose_lijomol #Suriya pic.twitter.com/gsBLRybT3J
— karthick P (@karthickjourno) January 19, 2022
