Jana Nayagan : కాబోయే సీఎం విజయ్.. ఇక భారీగా ‘జన నాయగన్’ రిలీజ్.. ఫ్యాన్స్ కి పండగే.. రిలీజ్ ఎప్పుడంటే?
జన నాయగన్ ఇటీవల సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ సెన్సార్ ఇబ్బందులతో ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. (Jana Nayagan)
- Saketh U
- Published on- May 4, 2026 / 01:44 PM IST
Jana Nayagan
Jana Nayagan : తమిళ్ స్టార్ హీరో విజయ్ తమిళనాడు ఎన్నికల ముందు చేసిన జన నాయగన్ సినిమా రిలీజ్ అవ్వకుండా గత కొన్నాళ్లుగా అనేక అడ్డంకులు ఎదుర్కొంది. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లడంతో తన చివరి సినిమా అని ప్రకటించారు. జన నాయగన్ ఇటీవల సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ సెన్సార్ ఇబ్బందులతో ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది.
సెంట్రల్ సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చినా స్టేట్ సెన్సార్ బోర్డు మాత్రం ఈ సినిమాకు క్లియరెన్స్ ఇవ్వలేదు అని సమాచారం. అయితే సినిమాలో తమిళనాడు స్టేట్ పాలిటిక్స్ పై, అక్కడి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఉన్నాయని అందుకే అక్కడి ప్రభుత్వం సినిమాకు క్లియరెన్స్ ఇవ్వకుండా సినిమా రిలీజ్ అడ్డుకుంటున్నారని విమర్శలు వచ్చాయి.
Also Read : Vijay Trisha : సీఎం కాబోతున్న విజయ్.. ట్రెండింగ్ లో త్రిష.. విజయ్ – త్రిష ఫొటోలు వైరల్..
కావాలనే విజయ్ జన నాయగన్ సినిమా అడ్డుకుంటున్నారని, అదంతా రాజకీయ కుట్ర అని పలువురు విజయ్ మద్దతుదారులు వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో విజయ్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. విజయ్ సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఫ్యాన్స్, కార్యకర్తలు విజయ్ సీఎం అంటూ స్లొగన్స్ చేస్తున్నారు. దీంతో విజయ్ సీఎం అయితే జన నాయగన్ సినిమా ఈజీగా రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్, మేకర్స్ ఆశిస్తున్నారు.
విజయ్ సీఎంగా ప్రమాణం చేశాకే జన నాయగన్ సినిమా రిలీజ్ చేస్తారని, అప్పుడైతే విజయ్ ప్రభుత్వంలో సినిమాకు ఉన్న అడ్డంకులు అన్ని క్లియర్ చేస్తారు అని, సీఎం అయ్యాక ఫస్ట్ సినిమా అంటే ఇంకా హైప్ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే జన నాయగన్ సినిమా విజయ్ సీఎంగా ప్రమాణం చేశాకే రిలీజ్ చేస్తారని తమిళ మీడియా సమాచారం.
Also Read : Thalapathy Vijay : తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. కాబోయే సీఎం విజయ్.. విజయ్ వీర విహారం.. ఫొటోలు..
ఇక ఈ సినిమా బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో పూజాహెగ్డే, మమితబైజు కీలక పాత్రల్లో నటించారు. దీంతో ఫ్యాన్స్ జన నాయగన్ సినిమా భారీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.
